దక్షిణాది రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. కర్ణాటకలో ఈరోజు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. అలాగే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుందని తెలిపింది.
పవన్ కల్యాణ్ దక్షిణాది రాష్ట్రాల పర్యటన ప్రారంభమైంది.. హైదరాబాద్ నుంచి బయల్దేరిన పవన్ కల్యాణ్.. కొచ్చి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు.. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని పలు పుణ్య క్షేత్రాలు దర్శించుకునే యాత్రకి ఈ రోజు శ్రీకారం చుట్టిన ఆయన.. ఇందులో భాగంగా కేరళలోని కొచ్చి విమానాశ్రయానికి కొద్దిసేపటి క్రితం చేరుకున్నారు. కొచ్చి సమీపంలోని శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని ఈ పర్యటనలో మొదట దర్శించుకోనున్నారు పవన్ కల్యాణ్..
గోల్కొండ హోటల్లో దక్షిణ రాష్ట్రాల CACP సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పాండిచేరి, తెలంగాణ రాష్ట్రాల వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ.. రైతులు పండించే ప్రతి పంటకు సాగు ఖర్చు తగ్గట్టుగా MSP ధరలు రావడం లేదని, డా. స్వామినాథన్ కమిషన్ ఆధారంగా MSP ధరలను నిర్ణయించాలని CACP కమిషన్ కు సూచించారు.
హైదరాబాద్ నగరంలో జరుగుతున్న దక్షిణాది రాష్ట్రాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల సమావేశం ముగిసింది. ఈ సమావేశం దాదాపు ఆరు గంటల పాటు కొనసాగింది. ఇక, ఈ మీటింగ్ లో బీజేపీ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. పలు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులకు జేపీ నడ్డా వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. ఈ మీటింగ్ లో దక్షిణాది రాష్ట్రాల్లో అనుసరించాల్సిన ఎజెండాను రూపొందించాలని ఈ మీటింగ్ లో నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని మోదీ తొమ్మిదేళ్లలో చేపట్టిన సంక్షేమ పథకాలు,…
ఒమిక్రాన్ ఎంట్రీ తర్వాత కరోనా థర్డ్ వేవ్ భారత్‌లో కోవిఢ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది.. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో కొత్త కేసుల సంఖ్య క్రమంగా పెరుగూ ఆందోళనకు గురిచేస్తోంది.. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా.. దక్షిణాది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రస్తుత కోవిడ్ పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు.. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తెలంగాణ, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవుల ఆరోగ్యశాఖ మంత్రులు, అధికారులు పాల్గొన్నారు..…