వర్షాకాలంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా వ్యాదులు వస్తాయి.. అందుకే ఆహరం విషయంలో ఆచి తూచి ఆలోచించాలి.. ఆరోగ్య మీద ధ్యాస పెట్టాలి ఆరోగ్యానికి మేలు చేసే విధంగా ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండాలి.. ఈ కాలంలో ఈ ఆహార పదార్థాలను తీసుకోవడం అస్సలు మంచిది కాదు మరి అవేంటనేది మీరు తెలుసుకుంటే వాటికి దూరంగా ఉండి ఆరోగ్యంగా ఉండొచ్చు.. ఇక ఆలస్యం ఎందుకు ఓ లుక్ వేద్దాం..
పానీపూరి అంటే లొట్టలు వేసుకుంటు తింటారు.. ఈ కాలం తీసుకోకూడదని నిపుణులు అంటున్నారు.. నొప్పిపానీ నీరు కలుషితం అయ్యే అవకాశం ఉంది కడుపు విరోచనాలు వంటి ఇబ్బందులు కలగచ్చు. కాబట్టి ఈ కాలంలో ఇలాంటి ఆహార పదార్థాలను తీసుకోవద్దు. వర్షా కాలంలో పచ్చి కూరగాయలకు దూరంగా ఉండండి పచ్చి కూరగాయలను ఈ కాలంలో తినడం వలన గ్యాస్ ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. ఒకవైపు వర్షాలు చేపలు రొయ్యలు వంటివి తీసుకోవద్దు.. వర్షాలు పడుతుంటే అవి సంతానం వృద్ధి చేస్తాయి.. ఇటువంటివి తీసుకుంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది చేపల రొయ్యలు వంటి వాటికి వర్షాకాలం సంతాన ఉత్పత్తి సమయం ఇలాంటప్పుడు వాటిని తీసుకోకుండా ఉండడం మంచిది.
అలాగే పుట్టగొడుగులని కూడా ఈ కాలంలో తీసుకోవద్దు బ్యాక్టీరియా వల్ల కలిగే ఇన్ఫెక్షన్స్ ప్రమాదాన్ని మీకు తీసుకువస్తాయి. ఫ్రై చేసిన ఆహార పదార్థాలను కూడా ఈ కాలంలో తీసుకోకండి..మామిడి పండ్లు తీసుకోవద్దు పిత్తా వాత కఫ దోషాలు ఎక్కువ అవుతాయి మొటిమలు కూడా వచ్చేస్తాయి. వర్షా కాలం లో పెరుగు, పండ్ల రసాలను కూడా తీసుకో వద్దు ఇవి కూడా మీకు ఇబ్బందుల్ని కలిగిస్తాయి కాబట్టి వానా కాలంలో ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉండటమే బెస్ట్.. ఇక మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని అస్సలు తీసుకోకండి… ఎంతవరకు వేడి వేడి ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నించండి.. వేడి నీళ్లను తీసుకోవడం మంచిది.. పిల్లల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి… బయటకు వచ్చేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి..