Health Benefits Of Lady Fingers in Telugu: బెండకాయ అంటే నిజంగా అదో ఎమోషన్ అనే చెప్పాలి. చాలా మందికి బెండకాయ అంటే ఇష్టం ఉంటుంది. బెండకాయ ఫ్రై అన్నా, పులుసు అన్నా అసలు బెండకాయతో చేసే ఏ వంటకం అయినా ఫటాఫట్ తినేస్తారు. చిన్నప్పటి నుంచి కూడా బెండకాయం తింటే లెక్కలు బాగా వస్తాయని చెప్పి మరీ తినిపిస్తారు. కొంత మంది వీటిని పచ్చిగా కూడా తింటూ ఉంటారు. ఇవి కేవలం టేస్టీగా ఉండటమే కాదు చాలా ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగిస్తాయి.
Also Read: Emergency Alert: మీ ఫోన్‌కు ఎమర్జెన్సీ అలర్ట్ వచ్చిందా..? కంగారు పడకండి.. కారణం అదే
బెండకాయ తినడం వల్ల ప్రస్తుతం అనేక మందిని వేధిస్తున్న వ్యాధుల్లో ఒకటైన షుగర్ కూడా అదుపులో ఉంటుంది. షుగర్ పేషెంట్లు వారానికోసారయినా బెండకాయ తినడం మంచిది. ఎందుకంటే బెండ గింజలు, తొక్కలోని ఎంజైమ్‌లు ఇన్సులిన్ స్థాయిని క్రమబద్ధీకరిస్తాయి. బెండకాయ కూర వండగానే మనకు జిగురు జిగురుగా అనిపిస్తుంది. దీనికి కారణం బెండకాయలో ఫైబర్ ఎక్కువగా ఉండటం. దీని కారణంగానే బెండకాయ జీర్ణ వ్యవస్థకు ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. కొంచెం తిన్నా ఇది చాలా శక్తిని ఇస్తుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. ఊబకాయంతో బాధపడేవారికి బెస్ట్ మన బెండీ. బెండకాయలోని ఫ్లేవనాయిడ్లు మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చాలా ఉపయోగపడతాయి. మెదడు పనితీరుపై ప్రభావం చూపడం సహా.. జ్ఞాపకశక్తిని పెంపొందించడంలో బెండకాయలు కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే చిన్నప్పుడు బెండకాయ తింటే చదువు బాగా వస్తుంది అని చెబుతుంటారు.
దంతక్షయంతో బాధపడే వారు కూడా బెండకాయను తీసుకుంటే మంచి ప్రయోజనాలు ఉంటాయి. కేవలం శరీరం లోపలే కాకుండా బయట చర్మం కాంతివంతగా ఉండటానికి కూడా బెండకాయ ఉపయోగపడుతుంది. అంతేకాకుండా దీనిలో ఉండే కాల్షియం వల్ల కూడా అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఎముకలు బలంగా ఉండటానికి కాల్షియం ఎంతో ఉపయోగపడుతుంది అన్న విషయం తెలిసిందే. ఇందులో ముఖ్యంగా క్యా్న్సర్ నిరోధక కారకాలు కూడా ఉంటాయి. పెద్ద పేగు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ నివారణలో బెండకాయలు ఎంతో ఉపయోగపడతాయి. ఇక బెండకాయలో ఉండే ఫోలిక్ యాసిడ్ నాడీవ్యవస్థ ఆరోగ్యకరంగా ఏర్పడడానికి దోహదం చేస్తుంది. అందుకే కడుపుతున్న వారు బెండకాయలు తింటే శిశువుకు చాలా మంచిది.