బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న భారత మహిళల జట్టు.. 4 రోజుల్లో వరుసగా రెండోసారి ఓడిపోయింది. బంగ్లాదేశ్ సిరీస్‌లో భాగంగా చివరి టీ20 మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టీమిండియాను ఓడించింది. ఆదివారం జరిగిన వన్డే సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో 40 పరుగుల తేడాతో భారత్ ఓడిపోయింది. హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత మహిళల జట్టు ప్రస్తుతం 3 టీ20, 3 వన్డేల సిరీస్‌లు ఆడనుంది.
Balayya: ఆదివారం కూడా బ్రేక్ లేదు… భగవంత్ కేసరి జోష్ లో ఉన్నాడు
టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో టీమిండియా కైవసం చేసుకున్నప్పటికీ.. ఆఖరి మ్యాచ్‌లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఆ ఓటమి నుంచి జట్టు గుణపాఠం నేర్చుకోలేక పోవడంతో వన్డే సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లోనూ పేలవ ప్రదర్శన కొనసాగింది. వర్షం కారణంగా 44-44 ఓవర్ల పాటు మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ను భారత బౌలర్లు 43 ఓవర్లలో 152 పరుగులకే కట్టడి చేశారు.
Weather: ఒకచోట వేడి పొగలు.. మరొక చోట భారీ వర్షాలు..!
భారత బౌలర్లలో అమంజోత్ కౌర్ తన అరంగేట్రం వన్డేలో 31 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టింది. దేవిక 2, దీప్తి శర్మ ఒక వికెట్ తీశారు. మిగతా మ్యాచ్ ల్లో ఎలాగైనా గెలిచి సిరీస్ ను దక్కించుకోవాలని టీమిండియా ఎదురుచూస్తుంది.