దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర విద్యుత్ సంక్షోభం ఏర్పడింది. నగరంలో పలు చోట్ల తీవ్ర విద్యుత్ అంతరాయం ఏర్పడింది. దీంతో సోషల్ మీడియా వేదికగా కంప్లంట్‌లు పెరిగిపోయాయి. అప్రమత్తమైన ఆప్ ప్రభుత్వం.. సమస్య పరిష్కారం కోసం కేంద్రానికి ఆప్ మంత్రి అతిషి లేఖ రాశారు.
ఢిల్లీలో వరదల విషయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజల గురించి ఆలోచించాలన్నారు. ఒక సీఎంగా ఉండి తన బాధ్యతల నుంచి తప్పించుకుంటున్నారని విమర్శించారు.