కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకి సాలిడ్ ఫ్యాన్ బేస్ ఉంది, ఈ ఫ్యాన్ బేస్ కి కారణం సూర్య చేసిన సినిమాలు మాత్రమే కారణం కాదు సూర్య మంచితనం కూడా. ప్రతి స్టార్ హీరో తనని స్టార్ చేసిన ఫాన్స్ కి సొసైటీకి ఎదో ఒక సాయం చేస్తూనే ఉంటారు. చిరు, రజినీకాంత్, ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, దళపతి విజయ్… ఇలా ఒకరేంటి ప్రతి స్టార్ హీరో తమ వంతు సాయం చేస్తూనే ఉంటారు. ఇదే కోవలో సూర్య గురించి కూడా చేరుతాడు. ఆగ్రమ్ ఫౌండేషన్ పేరుతో పేద విద్యార్థులని చదివించే పని చేస్తున్నాడు. లేటెస్ట్ గా సూర్య 5200 మంది పేద విద్యార్థులని గ్రాడ్యుయేషన్ చదివించాడు. తమిళ్ మీడియమ్ స్టూడెంట్స్ ని సూర్య ఫౌండేషన్ ద్వారా చదివించాడు. దీంతో సోషల్ మీడియాలో సూర్య ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో సూర్య ఫాన్స్ మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ సూర్యని రియల్ లైఫ్ స్టార్ గా చూస్తున్నారు.
Read Also: Balayya: ఆదివారం కూడా బ్రేక్ లేదు… భగవంత్ కేసరి జోష్ లో ఉన్నాడు