ఆసియా క్రీడల కాంస్య పతక విజేత, హైదరాబాద్ యువ అథ్లెట్ అగసర నందినికి హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు సన్మానం చేశారు. ఉత్తరాఖండ్‌లో జరుగుతున్న జాతీయ క్రీడల్లో తెలంగాణకు తరఫున బరిలోకి దిగుతున్న నందినికి లక్ష రూపాయల చెక్‌ను నగదు ప్రోత్సాహకంగా అందించారు జగన్మోహన్ రావు.