Congress vs BRS: తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్తత.. హరీశ్ రావును అడ్డుకున్న పోలీసులు!
- కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు
- బీఆర్ఎస్ అప్పులు, గురుకులాల్లో అవినీతిపై సవాళ్లు
- తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్తత
- గన్‌పార్క్‌కు బయల్దేరిన హరీష్ రావును అడ్డుకున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress vs BRS: కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. రాష్ట్ర ప్రభుత్వ అప్పులు, గత బీఆర్ఎస్ ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలు, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గురుకుల విద్యాసంస్థల్లో అవినీతి ఆరోపణలపై ఇరు పార్టీల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో గన్‌పార్క్ కేంద్రంగా రాజకీయ వేడి మరింత పెరిగింది. కాంగ్రెస్ తరఫున మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ క్రికెటర్ మహ్మద్ అజహరుద్దీన్ గన్‌పార్క్‌కు చేరుకుని చర్చకు సిద్ధమయ్యారు.
మరోవైపు బీఆర్ఎస్ నేతలు కూడా అన్ని ఆధారాలతో వస్తామని ప్రకటించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గన్‌పార్క్, ప్రెస్‌క్లబ్, తెలంగాణ భవన్ పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ… ‘ఎక్కడైనా చర్చకు మేము సిద్ధం. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులు, ఇతర అంశాలపై అన్ని ఆధారాలతో గన్‌పార్క్‌కు వస్తున్నాం. కాంగ్రెస్ మంత్రులు అక్కడే ఉండాలి’ అని సవాల్ విసిరారు. ప్రజల ముందే వాస్తవాలను వెల్లడిస్తామని ఆయన స్పష్టం చేశారు.
Also Read
- Dharmana Prasada Rao: స్థానిక ఎన్నికల్లో బీసీలకు ఏం చేస్తారో చూపించండి.. ధర్మాన సవాల్
- India vs Pakistan: "అసలు మజా అప్పుడే".. దాయాదుల మధ్య పసిడి పోరు..
- Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
- BC Reservations: బీసీ రిజర్వేషన్ల జీవోలు కొట్టివేత.. హైకోర్టు తీర్పుపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
అయితే తెలంగాణ భవన్ నుంచి గన్‌పార్క్‌కు బయల్దేరిన హరీశ్‌రావును పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో కొద్దిసేపు తెలంగాణ భవన్ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు అదనపు బలగాలను మోహరించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా తెలంగాణ భవన్‌కు చేరుకుని పార్టీ నేతలతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులపై బహిరంగ చర్చకు తాము సిద్ధమని బీఆర్ఎస్ నేతలు ప్రకటించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా అప్పుల అంశంపై చర్చించేందుకు తెలంగాణ భవన్‌కు వస్తానని ప్రకటించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తించింది.
గన్‌పార్క్‌లో అమరవీరుల స్తూపం వద్ద చర్చ నిర్వహించాలని బీఆర్ఎస్ నేతలు పట్టుబడుతుండగా.. కాంగ్రెస్ నాయకులు కూడా అదే స్థాయిలో ఎదురుదాడికి సిద్ధమయ్యారు. దీంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇరు పార్టీల నేతల వ్యాఖ్యలు, సవాళ్లు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. ప్రస్తుతం గన్‌పార్క్, తెలంగాణ భవన్, ప్రెస్‌క్లబ్ పరిసరాల్లో భారీ పోలీసు బందోబస్తు కొనసాగుతోంది. పరిస్థితిని ఎప్పటికప్పుడు పోలీసులు పర్యవేక్షిస్తున్నారు.
తాజావార్తలు
-
Dharmana Prasada Rao: స్థానిక ఎన్నికల్లో బీసీలకు ఏం చేస్తారో చూపించండి.. ధర్మాన సవాల్
-
India vs Pakistan: “అసలు మజా అప్పుడే”.. దాయాదుల మధ్య పసిడి పోరు..
-
Sugar Sale Quota October 2026: దసరాకు ముందు చక్కెర కోటా విడుదల.. ఈ 3 రాష్ట్రాలకే భారీ కేటాయింపులు
-
Abhishek Sharma Bowling: ఏషియన్ గేమ్స్‌లో అభిషేక్ శర్మ సంచలనం.. వరుసగా మూడు వికెట్స్!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
ట్రెండింగ్
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!