NTV Telugu Site icon

Harish Rao : ఆర్బీఐ నివేదికతో నిజాలు బయటపడ్డాయి.. అబద్దాలు తేలిపోయాయి..

Harish Rao

Harish Rao

Harish Rao : నిన్న ఆర్బీఐ ఇచ్చిన నివేదికతో నిజాలు బయటపడ్డాయి…అబద్ధాలు తేలిపోయాయని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష రావు అన్నారు. ఇవాళ ఆయన సిద్దిపేటలో మీడియాతో మాట్లాడుతూ.. అబద్ధాల పునాదుల మీద ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం అవే అబద్దాలను ప్రచారం చేస్తూ కాలం గడుపుతుందని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ పార్టీపై బురద జల్లే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తే నిజం నిప్పులాంటిది నిజం నిలకడ మీద తెలుస్తుందన్నారు. పదేళ్ల మా పాలనపై కాంగ్రెస్ మంత్రులు, సీఎం రేవంత్ చేస్తున్న దుష్ప్రచారం అంతా తప్పని తేలిపోయిందని ఆయన అన్నారు. పదేళ్లలో ప్రతి రంగాన్ని కేసీఆర్ అభివృద్ధి పరిచారని RBI గణాంకాలు చెబుతున్నాయని, పదేళ్లలో తెలంగాణ అభివృద్ధి రికార్డు సృష్టించిందన్నారు హరీష్‌ రావు. తెలంగాణ దివాలా రాష్ట్రం కాదు దివ్యంగా వెలుగుతున్న రాష్టమని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అప్పుల రాష్టం అని ప్రచారం చేసిందని మండిపడ్డారు హరీష్‌ రావు.

LAC Border truce: చైనా ఫారెన్ మినిస్టర్‌‌తో భేటీ కానున్న అజిత్ దోవల్.. సరిహద్దులపై చర్చ..

సీఎం లేని దివాలాని ప్రచారం చేసి మాపై బురద జల్లేందుకు ప్రయత్నించి ఆయనే బురద జల్లుకున్నారని, 7 లక్షల కోట్ల అప్పు అని ప్రచారం కాంగ్రేస్ మంత్రులు పదే పదే గోబెల్స్ చేశారన్నారు. 2014, 15 ఏడాది ముందే 72, 658 కోట్ల అప్పుని తెలంగాణకి గత కాంగ్రెస్ ప్రభుత్వం మా ప్రభుత్వానికి అప్పుగా ఇచ్చిందని, 2024 డిసెంబర్ 7 నుంచి మార్చి 2024 వరకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 15 వేల కోట్లు అప్పు చేసిందన్నారు. రెండు కలిపితే ఒక లక్ష 6 వేల కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వమే అప్పు చేసిందని, పదేళ్ల BRS హయాంలో 3, 22, 499 కోట్ల రూపాయల అప్పు మాత్రమే మేము చేశామన్నారు హరీష్‌ రావు. ఈ విషయాన్ని స్వయంగా RBI వెల్లడించిందని, ఇప్పటికైనా విషప్రచారాన్ని కాంగ్రెస్ నేతలు మానుకోవాలన్నారు. ఉదయ్ స్కీంల మీద అప్పుని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల మీద నెడితే అది కూడా అప్పులో కలిపారని, విద్యుత్ ఉత్పత్తిలో 106 శాతం యూనిట్లకు పెంచామన్నారు. 82 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లు ఇచ్చి 105 శాతం పెంచామని హరీష్‌ రావు వ్యాఖ్యానించారు.

South India Shopping Mall: ఒంగోలులో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ శుభారంభం

Show comments