తెలంగాణ మహిళా సాధికారతకు చాకలి ఐలమ్మ ప్రతీక అని ఆర్థిక మంత్రి టీ హరీశ్ రావు ఆదివారం కొనియాడారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో కలిసి సిద్దిపేటలో ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ వెనుకబడిన తరగతుల ఆత్మగౌరవానికి ఆమె ప్రతీక అని అన్నారు. రాష్ట్ర సాధన ఉద్యమాన్ని విజయవంతంగా నడిపిస్తూ ఐలమ్మ జీవితం నుంచి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, ఇతర నేతలు స్ఫూర్తి పొందారని, ఐలమ్మ జయంతి, వర్ధంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు హరీశ్‌రావు తెలిపారు.
Also Read : Maharashtra : వీడు అసలు తండ్రేనా.. పసికందును నేలకేసి కొట్టి..
రజక వర్గాన్ని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిని మంత్రి వివరిస్తూ సిద్దిపేటలో ప్రభుత్వం ఆధునిక ధోబీ ఘాట్‌ను నిర్మించిందని తెలిపారు. కుల ఆధారిత వృత్తులపై ఆధారపడిన ప్రజల జీవితాల మెరుగుదల కోసం చేపట్టిన వివిధ కార్యక్రమాలలో భాగంగా రజక సమాజంలోని నిరుద్యోగులు వారి స్వంత వ్యాపారాన్ని ఏర్పాటు చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోంది. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ రోజా శర్మ, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Also Read : Rahul Gandhi: భారత ఆత్మపై దాడి.. వారు మూల్యం చెల్లించాల్సిందే..