భార్యా భర్తల గొడవకు పసిపిల్లలను బలి చేస్తున్న ఘటనలు ఈమధ్య ఎక్కువగా జరుగుతున్నాయి.. తాజాగా మహారాష్ట్రలో దారుణ ఘటన వెలుగు చూసింది.. మద్యం మత్తులో కన్న తండ్రి 18 నెలల చిన్నారి పాలిట కాలయముడు అయ్యాడు.. వివరాల్లోకి వెళితే..
మహారాష్ట్రలోని థానే జిల్లాకు చెందిన అల్తాఫ్ మహ్మద్ సమీవుల్లా అన్సారీ కు కొన్నేళ్ల కిందట వివాహమైంది. అతడు తన భార్యతో కలిసి దైఘర్ గావ్ లోని అభయ్ నగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. వీరికి ఓ కూతురు జన్మించింది. ఆ కూతురుకి ప్రస్తుతం 18 నెలల వయస్సు ఉంటుంది. అన్సారీ కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అంతా చక్కగా సాగిపోతోందని అనుకుంటున్న సమయంలో అతడు తాగుడుకు బానిస అయ్యాడు.. మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్యతో గొడవపడేవాడు. ఆమెతో వాగ్వాదానికి దిగేవాడు. ఈ క్రమంలో 15 రోజుల కిందట కూడా ఆమెతో గొడవపడ్డాడు. ఈ సారి వారి మధ్య వాగ్వాదం ఎక్కువైంది. దీంతో అన్సారీ తన భార్యతో పగ పెంచుకున్నాడు…
ఆమెతో మళ్లీ గొడవ పెట్టుకున్నాడు.. మాటకు మాట పెరగడంతో భార్యను కొట్టాడు.. అంతటితో అతని కోపం చల్లార్లేదు.. అక్కడే ఆడుకుంటున్న తన కూతురును బయటకు తీసుకొచ్చి నేలకేసి బలంగా కొట్టాడు..తీవ్రగాయాల పాలైన బాలిక అక్కడికక్కడే మరణించింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న థానే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. అతనిపై పలు సెక్షన్స్ తో కేసు నమోదు చేశారు.. పసికందుకు పోస్ట్ మార్టం నిర్వహించారు.. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..