ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీష్ రావు జోరు పెంచారు. నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రత్యర్థ పార్టీలపై విమర్శలు గుప్పిస్తున్నారు. అదేసమయంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను వివరిస్తూ.. మళ్లీ అధికారంలోకి వస్తే ఇచ్చే పథకాలపై వెల్లడిస్తున్నారు. నేపథ్యంలోనే నేడు హరీష్ రావు సంగారెడ్డిలో మాట్లాడుతూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిలపై మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు.
కుర్చీల కోసం పదవులు మారే వ్యక్తి రేవంత్ రెడ్డి అని మంత్రి హరీష్ రావు అన్నారు. గతంలో రేవంత్ రెడ్డి టిడిపిలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని, వాళ్ళ నాన్న చనిపోతే అంత్యక్రియలు చేశాక స్నానం చేయడానికి కరెంట్ లేదని అసెంబ్లీలో చెప్పారన్నారు హరీష్ రావు. ఆనాడు సోనియా గాంధీని బలి దేవత అన్నాడు, ఇటలీ బొమ్మ అన్నాడు నోటికి ఏదోస్తే అదే తిట్టిండని, ఇప్పుడు సోనియాగాంధీ దేవత అంటున్నాడు..రేవంత్ నోటికి మొక్కాలన్నారు.
Also Read : Sri Bhramara Townships: శ్రీ భ్రమర టౌన్‌షిప్స్ 8వ వార్షికోత్సవ వేడుకలు
అంతేకాకుండా.. ‘ఏ ఎండకి ఆ గొడుగు పట్టే రకం రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీ వచ్చి నేను బీజేపీతో పోరాడుతా బీజేపీపై పోరాడే డీఎన్ఏ నాది అన్నారు. మరి రేవంత్ రెడ్డి డీఎన్ఏ ఏదో రాహుల్ తెలుసుకోవాలి. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి డిఎన్ఏ లు మ్యాచ్ కావట్లేదు. మేం ఎవ్వరికీ బీ టీం కాదు మేం తెలంగాణ ప్రజల టీం. బీజేపీ, బీఆర్‌ఎస్ ఎప్పటికి ఒకటి కాదు. నీళ్ల, నూనె ఎప్పుడైనా కలుస్తాయా ఇది కూడా అంతే. కేసీఆర్ కి పనితనం తప్ప పగతనం లేదు. కేసీఆర్ తలుచుకుంటే రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కేసులో జైల్లో వేయకపోవునా..? పక్క రాష్టాల్లో చూస్తున్నాం వాళ్ళు గెలవగానే వీళ్ళను జైలుకు పంపిస్తారు. వీళ్ళు గెలవగానే వాళ్ళని జైలుకి పంపిస్తారు.’ అని హరీష్ రావు అన్నారు.