Harish Rao : ప్రతిపక్షాల మీద విమర్శ చేయడం తప్ప పాలన మీద దృష్టి లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రంగారెడ్డి జిల్లా పాలమాకుల గురుకుల పాఠశాలను సందర్శించి విద్యార్థులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ఆడపిల్లలు రోడ్డెక్కి ధర్నా చేస్తే ఎందుకు స్పందించరని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారని, ప్రతిపక్షాల మీద విమర్శ చేయడం తప్ప పాలన మీద దృష్టి లేదని ఆయన విమర్శించారు. చీమ కుట్టినట్లు అయినా మీకు లేదు. సిగ్గుచేటని, గురుకులాల్లో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయే పరిస్థితి అన్నారు హరీష్ రావు. ప్రభుత్వం మీద నమ్మకం కొద్ది గురుకులాల్లో జాయిన్ చేస్తే ఏం చేస్తున్నారని, ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్. నువ్వు పూర్తిగా విఫలం అయ్యావంటూ హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. పిల్లలు రోడ్డు మీదకు వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తుంటే బాధ తెల్సుకోవాలని వచ్చానని, దుఃఖాన్ని ఆపుకోలేక పోతున్నారు. భయంతో వణికిపోతున్నారు. కర్రలు విరిగేలా కొడుతున్నారని ఏడుస్తున్నారన్నారు హరీష్ రావు. అన్నంలో, పప్పులో పురుగులు అంటే తినేసి తినండి అంటున్నారు అని బాధపడుతున్నారని, ఒక జత బట్టలు మాత్రమే ఇచ్చారు. రెండో జత ఇవ్వలేదు అంటున్నారన్నారు హరీష్ రావు.
Russia: రష్యాలో ఘోర ప్రమాదం.. 22 మందితో ప్రయాణిస్తున్న హెలికాప్టర్ మిస్సింగ్
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
అంతేకాకుండా..’పుస్తకాలు కూడా ఇవ్వని పరిస్థితి. కేసీఆర్ గారు సన్నబియ్యం తో అన్నం పెడితే మీరు గొడ్డు కారంతో పెడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గురుకులాల పట్ల తీవ్ర నిర్లక్ష్యం. 500 మంది ఆసుపత్రుల పాలయ్యారు. 38 మంది చనిపోయారు. పాములు కరిచి చనిపోతున్నారు. ఎలుకలు కొరికి ఆసుపత్రుల పాలవుతున్నారు. ఒకప్పుడు గురుకులాల్లో చదవటం కల. ఇప్పుడు ఆవేదన చెందుతున్నారు. కించపరిచేలా మాట్లాడటం సరికాదు. ఇక్కడ ఉన్న టీచర్లను మార్చండి. ముఖ్యమంత్రి విద్యా శాఖా మంత్రి గా ఉన్నారు. మైనార్టీ గురుకులాలు జనవరి నుండి మెస్ బిల్లులు ఇవ్వలేదు. ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి తక్షణం చర్యలు తీసుకోండి. సన్నబియ్యం కాదు పురుగుల అన్నం పెడుతున్నరు. తక్షణమే స్పందించి చర్యలు తీసుకోండి. మా నెంబర్ కూడా పిల్లలకి ఇచ్చాం.’ అని హరీష్ రావు అన్నారు. అంనతరం మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి మాట్లాడుతూ.. గురుకులాలను గాలికి వదిలేశారని, విద్యా శాఖను పట్టించుకోవడం లేదన్నారు. ఎవరు ఏం అడిగిన పట్టించుకునే వారు లేరని, సీఎం ఎందుకు దృష్టి పెట్టడం లేదని, సమీక్ష కూడా ఎందుకు నిర్వహించలేదన్నారు. అసెంబ్లీలో అడిగినా సమాధానం లేదని ఆమె మండిపడ్డారు.
Maharashtra: ఇంట్లో నుంచి దుర్వాసన.. లోపలికి వెళ్లిన పోలీసులకు షాక్..
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?