Software Engineer : ఛీ దీనమ్మ జీవితం.. ఏడాదికి రూ.58లక్షల జీతం.. అయిన ఒక్క గర్ల్ ఫ్రెండ్ లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Software Engineer : జీవితం ఎప్పుడు మనం అనుకున్నట్లు ఉండదు. అంతమాత్రానికి నిరాశకు గురికావద్దు. రోజు అన్న తర్వాత రాత్రిపగలు ఎలానో జీవితంలో కూడా కష్టసుఖాలు కామన్. ఏదో చిన్న సమస్య వచ్చిందని జీవితమే వేస్ట్ అనుకుంటే పొరపాటు. వచ్చిన సమస్యని సమర్ధవంతంగా ఎదుర్కొంటే జీవితంలో ముందుకెళ్లగలం. కానీ ఈ మధ్య చిన్న సమస్యలనే భూతద్దంలో చూసి పెద్దవనుకుని కొందరు అనవసరంగా జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. సమస్యలు వస్తే ఎదుర్కొవాలి తప్ప అధైర్య పడవద్దు. ఒక్కొసారి అన్నీ ఉన్నా మనశ్శాంతి ఉండదు. ఇలాంటిదే ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగికి జరిగింది. ఇప్పుడు తాను ట్విటర్లో పేర్కొన్న విషయాలు వైరల్ అవుతున్నాయి. బెంగళూరుకి చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తాను లైఫ్‌ని ఒంటరితనంతో భారంగా గడుపుతున్నానని.. జీవితం ఆసక్తికరంగా ఉండేందుకు తగిన సలహా ఇవ్వండని ట్విట్టర్‌లో లేఖ పెట్టాడు.
Read Also : Balineni Srinivasa Reddy : అందులో పెట్టుబడులు నేను పెట్టలేదు.. నిరూపిస్తే నా ఆస్తి రాసిస్తా
Also Read
దీంట్లో తన జీవితం చాలా నిరాశగా ఉందని.. భారంగా నడుస్తోందని అతను లేఖలో పంచుకున్నాడు. దాదాపుగా మూడేళ్లుగా ఒకటే ఉద్యోగంలో ఉన్నానని.. ఏడాదికి రూ. 58 లక్షలు సంపాదిస్తున్నా సంతోషం లేదని లేఖలో పేర్కొన్నాడు. తన ఫ్రెండ్స్‌లాగా తన జీవితంలో ఒక్క గర్ల్ ఫ్రెండ్ లేదని .. తన లైఫ్ తనకు నచ్చడం లేదని వెల్లడించాడు. జీవితం ఆసక్తికరంగా సాగాలంటే సలహా కావాలంటూ.. ఆ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ రాసిన లేఖపై నెటిజన్లు పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. ప్రతి ఒక్కరికి సమస్యలు ఉన్నాయని .. నీకున్న సంపాదన కూడా చాలామందికి ఇప్పుడు లేదని సంతోషంగా ఉండమని కొందరు.. గర్ల్ ఫ్రెండ్ ఉన్నంత మాత్రనా సంతోషంగా దొరుకుతుందని చెప్పలేమని..నువ్వే కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయమని మరికొందరు రకరకాలుగా సలహాలు ఇచ్చారు.
Read Also: Rains : ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్ష బీభత్సం
The other India.
Via @anonCorpChatInd pic.twitter.com/8G8t2kxBuU
— Sukhada (@appadappajappa) April 19, 2023
తాజావార్తలు
-
Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
-
South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
-
IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
-
CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
-
Rain Alert: ఏపీ వాసులకు అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!