Sayyesha Saigal: స్టార్ హీరో భార్యవి..ఒక బిడ్డ తల్లివి.. ఇలా ఐటెంసాంగ్ చేయడం ఏంటి అమ్మడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sayyesha Saigal: సాధారణంగా హీరోయిన్లకు పెళ్లి అయ్యాకా అవకాశాలు రావు అనేది ఇండస్ట్రీలో టాక్. ఇక తల్లి అయ్యింది అంటే హీరోల పక్కన రొమాన్స్ చేయాల్సినవారినే అక్కాచెల్లెళ్లను చేసేస్తున్నారు. అయితే హీరోయిన్స్ మాత్రం రీ ఎంట్రీ ఇవ్వాలనే తొందరలో ఏదైనా ఓకే అంటున్నారు. అందాల ఆరబోతకు సిద్ధమంటున్నారు. ఇక ఇవన్నీ చేయడం వెనుక డబ్బు ఉందా..? పేరు ఉందా..? అనేది ఎవరికి తెలియదు. ఇండస్ట్రీలో ఒక స్టార్
హీరోయిన్ మనవరాలు.. స్టార్ హీరో కూతురు.. మరో స్టార్ హీరోకు భార్య. ఆమె ఇప్పుడు ఒక సినిమాలో ఐటెం సాంగ్ చేయడం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఆమె ఎవరో కాదు సాయేషా సైగల్. అలనాటి నటి నజీరా భాను ముద్దుల మనవరాలు. కోలీవుడ్ స్టార్ హీరో ఆర్య భార్య.. అఖిల్ సినిమాతో తెలుగుతెరకు ఎంతో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది సాయేషా. మొదటి సినిమాతో టాలీవుడ్ ను మొత్తం తన వైపు తిప్పుకుంది. అయితే ఆ సినిమా విజయం అందుకోకపోవడంతో టాలీవుడ్ కు టాటా చెప్పేసి.. తమిళ్ సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే హీరో ఆర్య ప్రేమలో పడి, పెద్దలను ఒప్పించి పెళ్లాడింది.
NTR: భయమంటే తెలియని ఎన్టీఆర్ నే భయపెట్టిన మొనగాడు.. ఇతడే.. గుర్తుపట్టారా..?
Also Read
ఇక ఈ జంటకు అరియనా అనే ఒక పాప కూడా ఉంది. ఇప్పటివరకు మాతృత్వపు మధురిమలను ఆస్వాదిస్తున్న సాయేషా.. ప్రస్తుతం రీ ఎంట్రీకి సిద్దమయ్యింది. అయితే.. హీరోయిన్ గానో, సపోర్టివ్ క్యారెక్టర్ గా కాదు.. ఐటెం గర్ల్ గా. కోలీవుడ్ స్టార్ హారో శింబు, గౌతమ్ కార్తీక్ నటిస్తున్న మల్టీస్టారర్ పాతు తలా సినిమాలో అమ్మడు ఐటెం గర్ల్ గా ఎంట్రీ ఇచ్చింది. దీంతో అభిమానులు సాయేషాను ఏకిపారేస్తున్నారు. స్టార్ హీరో భార్యవి..ఒక బిడ్డ తల్లివి.. అయ్యి ఉండి ఇలా ఐటెం సాంగ్ ఎందుకు అమ్మడు. డబ్బు కోసమా అంటే.. ఆమెకు డబ్బుకు కొదువ లేదు. ఇక ఫేమ్ కోసమా అంటే అందులో కూడా తక్కువేమి కాదు. మరి ఎందుకు ఈ భామ ఇలాంటి నిర్ణయం తీసుకుంది అని అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సాంగ్ తో అమ్మడు ఆగుతుందో.. లేక కంటిన్యూ చేస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
-
Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
-
Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!