Emergency Landing: ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Emergency Landing: జనవరిలో జరిగిన ఘోరమైన విమాన ప్రమాదం తర్వాత విమానయాన భద్రతపై తీవ్ర హెచ్చరికలు ఉన్న నేపాల్‌లో.. శ్రీ ఎయిర్ లైన్స్‌కు చెందిన ఓ విమానం ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. దీంతో ఆ విమానాన్ని సురక్షితంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. శ్రీ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ఖాట్మండు నుండి నైరుతి నేపాల్‌లోని భైరహవాకు వెళ్లాల్సిన విమానంలో సిబ్బందితో సహా 78 మంది ఉన్నారు.
కుడి ఇంజిన్‌లో మంటలు చెలరేగినట్లు పైలట్ నివేదించడంతో వెంటనే ఆ విమానాన్ని ఖాట్మండుకు మళ్లించినట్లు శ్రీ ఎయిర్‌లైన్స్ ప్రతినిధి అనిల్ మనంధర్ చెప్పారు. ఖాట్మండులో విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని, ప్రయాణికులు, సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని నేపాల్ పౌర విమానయాన అథారిటీ (సీఏఏఎన్) ప్రతినిధి జగన్నాథ్ నిరౌలా తెలిపారు. “అది ల్యాండ్ అయినప్పుడు ఎటువంటి అగ్నిప్రమాదం సంభవించిన సూచనలు లేవు” అని నిరౌలా చెప్పారు.
Also Read
- Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ చీఫ్ న్యూయార్క్ ఈవెంట్.. మమ్దానీపై యూఎస్ సింగర్ ఘాటు వ్యాఖ్యలు..
- Kriti Sanon: రాహుల్‌గాంధీ-కంగనా మాటల యుద్ధం.. కృతి సనన్ రక్షాబంధన్ యాడ్ తొలగింపు
- YS Jagan: 'సీఎంగా ఏం చేస్తున్నా' అని చంద్రబాబు ప్రశ్నించుకోవాలి.. వైఎస్ జగన్ ఫైర్!
- Konda Murali: కొండా సురేఖ ఎపిసోడ్‌పై రాయబారం.. భట్టి విక్రమార్కతో కొండా మురళి భేటీ..
Read Also: Maharashtra: ‘పంచామృతం’ సూత్రం ఆధారంగా మహారాష్ట్ర బడ్జెట్.. ప్రవేశపెట్టిన ఫడ్నవీస్
మౌంట్ ఎవరెస్ట్‌తో సహా ప్రపంచంలోని 14 ఎత్తైన శిఖరాలలో ఎనిమిదింటికి నిలయమైన పర్వత నేపాల్‌కు తరచుగా విమాన ప్రమాదాలు జరిగిన చరిత్ర ఉంది. వాటిలో చాలా కష్టతరమైన భూభాగాలు, వాతావరణ పరిస్థితులలో ఆకస్మిక మార్పు కారణంగా ఈ విమాన ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. జనవరిలో దేశ రాజధాని ఖాట్మండు నుంచి పొకారా వెళ్తుండగా.. ల్యాండింగ్ సమయంలో విమానం క్రాష్ అయ్యింది. ప్రమాదం జరిగిన విమానంలో 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది చనిపోయారు. మృతుల్లో ఐదుగురు భారతీయులు ఉన్నట్టు యతీ ఎయిర్‌లైన్స్ వెల్లడించింది. నలుగురు రష్యా పౌరులు కూడా ప్రమాదంలో చనిపోయారు. ప్రమాదానికి ముందు విమానం గాలిలో చక్కర్లు కొట్టింది. ల్యాండింగ్‌కు కేవలం 10 సెకన్ల ముందు విమానం కుప్పకూలిన సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
Success Story: ఆ ఒక్క నిర్ణయం అతని జీవితాన్నే మార్చేసింది.. IT జాబ్ వదిలి మష్రూమ్ బిజినెస్‌తో లక్షలు!
-
Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ చీఫ్ న్యూయార్క్ ఈవెంట్.. మమ్దానీపై యూఎస్ సింగర్ ఘాటు వ్యాఖ్యలు..
-
Kriti Sanon: రాహుల్‌గాంధీ-కంగనా మాటల యుద్ధం.. కృతి సనన్ రక్షాబంధన్ యాడ్ తొలగింపు
-
Konda Murali : కాంగ్రెస్‌ను వీడేది లేదు, వివాదంతో నాకు సంబంధం లేదు.. కొండా మురళి సంచలనం
-
Yash’s Toxic: యశ్‌కి అగ్నిపరీక్ష.. ‘టాక్సిక్’ ముందు ఏకంగా రూ.1000 కోట్ల టార్గెట్!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..