తెలుగు రాష్ట్రాల్లో కండ్లకలక కలకలం రేపుతోంది. రోజురోజుకీ కేసులు భారీగా పెరుగుతున్నాయి. వర్షాలు, వరదలకు తోడు ఈ కండ్లకలకం ప్రజలను ఇబ్బంది పెడుతోంది. రెండు రాష్ట్రాల్లో కలిపి ఇప్పటికి వరకు 2500పైగా కేసులు నమోదయ్యాయి. ఒక్క మంచిర్యాల జిల్లా జైపూర్ హాస్టల్లోనే 400 మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. అయితే కండ్లకలకపై మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. కొన్ని జాగ్రత్తల ద్వారా కండ్లకలక (పింక్ ఐస్) కేసులను నయం చేయవచ్చని అన్నారు. “భయపడాల్సిన అవసరం లేదు, ఇది కొద్ది రోజుల్లోనే నయం అవుతుంది. ప్రజలు వైద్యులు సూచించిన కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే, వారు సులభంగా వ్యాధి బారిన పడకుండా తప్పించుకోవచ్చు, ”అని ఆయన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పింక్ ఐస్ వ్యాప్తిపై చర్చించేందుకు గత వారం అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, ఆరోగ్య అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పరిస్థితిని ఎదుర్కొనేందుకు అవసరమైన మందులను సమకూర్చినట్లు ఆయన తెలిపారు.
Also Read : Harish Rao : హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల నాలుగు 1000 పడకల టిమ్స్ ఆస్పతులు
ఇంతకీ వ్యాధి ఎలా సోకుతుంటే..
వర్షం పడినప్పుడు భూ ఉపరితలంలో ఉన్న వైరస్, బ్యాక్టీరియా పైకి లేచి గాల్లో కలిసిపోతుంది. అది కంటి దాకా చేరినప్పుడు ఇన్ఫెక్షన్ సోకుతుంది. ఫలితంగా పింక్ ఐ వస్తుంది. దీన్నే కండ్లకలక అంటాం. ఒక్కసారి ఒక్కరికి సోకితే వైరల్‌గా మారిపోతుంది. క్షణాలు, రోజుల్లో వందలాదిమందికీ వ్యాపిస్తుంది. కండ్లకలకలో కనిపించే ప్రధాన లక్షణాలు.. తెల్లగుడ్డు ఎరుపు/గులాబీ రంగులోకి మారడం, విపరీతమైన కళ్లు నొప్పులు, కళ్ల నుంచి అదేపనిగా పుసులు, చూపు మందగించడం, కాంతిని చూడలేకపోవడం, మంటలు, నీరుకారడం, కనురెప్పల వాపు, ముద్దగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
Also Read : CM KCR : జయశంకర్ సార్ తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్మరణీయులు