తెలుగుదేశం- జనసేన- బీజేపీ కూటమికి విజ్ఞప్తి అంటూ కాపు బలిజ సంక్షేమ సేవ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ మంత్రి చేగొండి హరి రామజోగయ్య లేఖ రాశారు. కూటమి మేనిఫెస్టో ప్రజలకు ఆమోదయోగ్యంగానే ఉన్నందుకు సంతోషిస్తున్నామని తెలిపారు. అలాగే కొన్ని సవరణలు చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. బీసీలకు ప్రతిపాదించిన పెన్షన్ల వయోపరిమితి 50 సంవత్సరాలు అర్హులైన అన్ని కులాలకు వర్తింపజేయాలని కోరారు. బీసీలకు మాత్రమే ప్రతిపాదించిన రూ. 4 వేల పెన్షన్ అర్హులైన అన్ని కులాలకు వర్తింప చేయాలన్నారు.
25శాతం ఉన్న కాపు కులస్తులకు కూడా టీడీపీ- జనసేన కూటమి వారి ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలతో సమానంగా అన్ని సౌకర్యాలు కలుగజేస్తూ కాపు డిక్లరేషన్ని కూడా ప్రకటించాలని హరిరామయ్య జోగయ్య డిమాండ్ చేశారు.
ఆంధ్ర ప్రదేశ్ లో రిజర్వేషన్ సౌకర్యం, ముద్రగడ పద్మనాభంపై గౌరవంతో కాపు సామాజిక వర్గం బలపరచడం వల్లే వైసీపీ 151 స్థానాలు కైవసం చేసుకుంది అని మాజీ మంత్రి హరిరామ జోగయ్య అన్నారు. ఏపీలో టీడీపీ- జనసేన మధ్య ఉన్న బంధాన్ని బలహీన పరచడానికి వైసీపీలోని కాపు మంత్రులు ప్రయత్నాలు చేస్తున్నారు