Nani : నేచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న మూవీ ది ప్యారడైజ్. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఒక్క టీజర్ తోనే ఇండస్ట్రీని షేక్ చేసి పడేసింది. కథ, కథనం, వేష ధారణ మొత్తం డిఫరెంట్ గా ఉంది. అసలు ఈ సినిమా కథను కూడా ఎవరూ ఊహించలేకపోతున్నారు. దాంతో అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. అయితే ఇందులో హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. కాగా ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. అందుకే మూవీ కోసం పాన్ ఇండియా హీరోయిన్ నే తీసుకోవాలని చూస్తున్నారంట.
Read Also : Kadiyam Srihari : గతంలో దేవాదుల ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది నేనే..
ఇప్పటికే నాని పక్కన నటించి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన కీర్తి సురేష్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నారంట. ఇందులో పాత్ర చాలా బలంగా ఉంటుందని.. అందుకే ఆమె అయితే బెటర్ అని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కాంబినేషన్ లో వచ్చిన దసరా మూవీ భారీ హిట్ అయింది. పైగా ఎలాంటి పాత్రలో అయినా కీర్తి సురేష్ ఒదిగిపోతుంది. అందుకే ఇప్పుడు ఆమెను తీసుకోవాలని శ్రీకాంత్ అనుకుంటున్నారంట. కానీ దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. కీర్తి సురేష్ ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉంది. నితిన్ ఎల్లమ్మ సినిమాలో కూడా నటించే ఛాన్స్ ఉంది.