Govt Employees, School Teachers, Go On ‘Mass Casual Leave’ in Gujarat: గుజరాత్ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు మాస్ లీవుల్లో విధులను బహిష్కరించారు. తమ డిమాండ్లను అంగీకరించాలని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేస్తూ.. శనివారం వివిధ శాఖల ఉద్యోగులు, ఉపాద్యాయులు సామూహికంగా సెలవులు తీసుకుని.. విధులకు గైర్హాజరు అయ్యారు. పాత పెన్షన్ విధానాన్ని(ఓపీఎస్) అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తగా వేలాది మంది ఉద్యోగులు, పాఠశాలల ఉపాధ్యాయులు శనివారం ‘మాస్ క్యాజువల్ లీవ్’ నిరసనల్లో పాల్గొన్నారు.
అయితే అనేక సంఘాలు శుక్రవారం ప్రభుత్వం చర్చలు జరిపాయి. ఈ చర్చల్లో ఉద్యోగుల అన్ని డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించింది. దీంతో శుక్రవారం ఆందోళనలను విరమించుకున్నాయి. అయితే ఓపీఎస్ తమ ప్రధాన డిమాండ్ అని.. దీన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఈ సమస్య రాష్ట్రంలోని ప్రతీ ఉద్యోగిని ప్రభావితం చేస్తుందని.. అందుకే శనివారం అంతా సామూహిక క్యాజువల్ లీవ్ తీసుకుని ఆందోళన చేయాలని నిర్ణయించుకున్నట్లు సౌరాష్ట్ర ప్రాంత రాష్ట్రీయ సంయుక్త మోర్చా కన్వీనర్ మహేష్ మోరి అన్నారు.
Read Also: Thank God: బాలీవుడ్ సినిమాకి షాక్.. బ్యాన్ విధించిన ప్రభుత్వం
ఒక్క భావ్ నగర్ జిల్లాలోనే 7 వేల మంది, కఛ్ జిల్లాలో 8వేల మంది ప్రభుత్వ ఉపాద్యాయులు శనివారం సెలవులో ఉన్నారు. ఓపీఎస్ విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ గాంధీనగర్ లోని పాత సచివాలయాన్ని ముట్టడించేందుకు పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ర్యాలీ తీశారు. 2005 కన్నా ముందు సర్వీసులో చేరిన వారికి మాత్రమే ఓపీఎస్ ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించిందని.. అయితే చాలా మంది ఉద్యోగులు 2005 తరువాత సర్వీసుల్లో చేరారని ఉద్యోగసంఘాలు పేర్కొంటున్నాయి. అందుకే ప్రభుత్వానికి తేలిసే విధంగా నిరసనలు తెలుపుతున్నట్లు ఉద్యోగులు చెబుతున్నారు. శుక్రవారం బీజేపీ ప్రభుత్వంలోని ఐదుగురు మంత్రులతో సమావేశం అయ్యారు పలు సంఘాల నేతలు.. ఓపీఎస్ మినహా ప్రభుత్వం అన్ని డిమాండ్లకు అంగీకరించిందని.. సంఘాల నేతలు చెప్పారు. ప్రభుత్వం చాలా డిమాండ్లను అంగీకరించడంతో ఉద్యమాన్ని విరమించాలని ఉద్యోగసంఘాల నేతలు కోరారు.