Rushikonda Buildings: విశాఖపట్నంలోని రుషికొండపై నిర్మించిన భవనాల వినియోగంపై ప్రజల సూచనలు స్వీకరించేందుకు ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ (ఏపీటీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. 9 ఎకరాల విస్తీర్ణంలో ఆధునీకరించిన ఈ భవనాలను ఏ విధంగా వినియోగించాలనే అంశంపై బహిరంగ ప్రకటన రిలీజ్ చేసింది.
ఇవాళ కౌల్సిల్ వేదికగా రుషికొండ అంశంపై మరోసారి రచ్చ జరిగింది.. దీనిపై శాసన మండలిలో మాట్లాడిన మంత్రి కందుల దుర్గేష్.. ఎండాడ భూములు, రుషికొండ అంశంలో స్ధానికుల అనుమతి లేకుండానే భూ వినియోగ మార్పిడి జరిగిందని విమర్శించారు.. రాష్ట్రంలో ఉన్న అన్ని బీచ్‌లలో బ్లూ ఫ్లాగ్ బీచ్ రుషికొండ బీచ్ అన్నారు.. అయితే, అన్ని అద్భుతంగా ఉండగానే రిసార్ట్స్ పడగొట్టేశారని మండిపడ్డారు మంత్రి కందుల దుర్గేష్..
రాష్ట్రంలో రుషికొండ భవనాల వివాదం నడుస్తోంది. ఆ భవనాన్ని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పరిశీలించారు. అనంతరం ఆ భవాలకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియా, మీడియా ఛానెల్ లలో వైరల్ గా మారాయి.