ఆగస్టు నెలకు సంబధించి జీఎస్టీ వసూళ్ల వివరాలను ప్రభుత్వం ఆదివారం విడుదల చేసింది. ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్టు 2024లో మొత్తం GST వసూళ్లు రూ. 1.75 లక్షల కోట్లు వచ్చినట్లు తెలిపింది. వార్షిక ప్రాతిపదికన జీఎస్టీ వసూళ్లు 10 శాతం పెరిగాయి. గత ఏడాది ఆగస్టులో వస్తు, సేవల పన్ను (GST) ఆదాయం రూ. 1.59 లక్షల కోట్లు కాగా.. ఈ ఏడాది ఆగస్టులో రూ. 1.75 లక్షల కోట్లు వసూలు చేసింది.
జులై నెలలో ద్రవ్యోల్బణం తీవ్ర రూపం దాల్చినట్టు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ద్రవ్యోల్బణం తీవ్ర రూపం దాల్చడానికి ఆహార ధరల పెరుగుదలే ప్రధాన కారణంగా ఆర్‌బీఐ భావించింది.