దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. భారతదేశంలో గత 24 గంటల్లో 12,591 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులు నిన్నటితో పోలిస్తే 20 శాతం ఎక్కువగా నమోదయ్యాయి.
దేశవ్యాప్తంగా ఇటీవల కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, లక్షణాల విషయంలో కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని మేదాంత హాస్పిటల్ వైద్యులు, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చెస్ట్ సర్జరీ ఛైర్మన్ డాక్టర్ అరవింద్ కుమార్ సూచించారు.
దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కొన్ని రోజుల ముందు వందల్లో నమోదైన కేసులు.. ప్రస్తుతం వేలల్లో నమోదవుతుండడం ప్రజల్లో ఆందోళనను రేకెత్తిస్తోంది.
దేశంలో కరోనా కేసుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది. గత కొన్ని రోజుల నుంచి వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. కొన్నాళ్ల వరకు కేసుల సంఖ్య కేవలం వందల్లోనే ఉండేది. కానీ ఇప్పు డు పరిస్థితి మారుతోంది.
చైనాలో కరోనా కేసులు ఉల్క వేగంతో పెరుగుతూ ఉన్నాయి. వైరస్ బారిన పడిన ప్రజలు కోకొల్లలుగా మరణం బారిన పడుతున్నారు. ఆ దేశంలోని ఐసీయూల్లో ఆస్పత్రి బెడ్లు పేషంట్లతో నిండిపోయాయి. దేశవ్యాప్తంగా శ్మశాన వాటికలు నిండిపోతున్నాయి.
కరోనా కొత్త వేరియంట్ కలవరపెడుతున్న వేళ కేంద్రం దృష్టి సారించింది. కొవిడ్ నివారణ చర్యలను చేపట్టాలని కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.
విదేశాల్లో కరోనా విజృంభిస్తుండడంతో భారత్ అప్రమత్తమైంది. పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతుండడంతో కేంద్ర కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర పాలిత ప్రాంతాలతో పాటు రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు చేసింది. కరోనాను ఎదుర్కొనేందుకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఉన్నతాధికారులతో సమీక్ష నిర
చైనా జీరో కొవిడ్ విధానంపై ఆ దేశ పౌరుల నుంచి నిరసన వ్యక్తం అవుతుండడంతో ఆంక్షలు సడలించాలని డ్రాగన్ సర్కారు చూస్తోంది. ఆ దేశం జీరో కొవిడ్ విధానాన్ని సులభతరం చేయడానికి చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. ఇదిలా ఉండగా.. జీరో-కొవిడ్ పాలసీని ఎత్తేస్తే లక్షల మంది ప్రాణాలు కోల్పోతారని పరిశోధకులు చెబుతున్న