కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు పెద్దలు. అంకితభావంతో కష్టపడితే అసాధ్యాలను సుసాధ్యం చేయొచ్చని నిరూపిస్తున్నారు యువతీ యువకులు. ప్రస్తుత రోజుల్లో గవర్నమెంట్ జాబ్స్ కు క్రేజ్ ఎలా ఉందో వేరే చెప్పక్కర్లేదు. పోస్టులు వందల్లో ఉంటే.. పోటీపడే వారు లక్షల్లో ఉంటున్నారు. ఇంతటి హెవీ కాంపిటిషన్ లో కూడా ఓ యువకుడు అసాధారణ ప్రతిభకనబర్చాడు. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 10 ప్రభుత్వ కొలువులను సాధించి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఇంతకీ ఆయన ఎవరంటే భూపాలపల్లి గుంటూరుపల్లికి చెందిన వి. గోపీకృష్ణ. ఉద్యోగాలే ఆయన కోసం క్యూకట్టినట్టుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలను సొంతం చేసుకున్నాడు.
Also Read:Duddilla Sridhar Babu : ‘రాజీవ్ యువ వికాసం’ పథకంపై మంత్రి కీలక వ్యాఖ్యలు
వి. గోపీకృష్ణ 10 ఉద్యోగాలను సాధించారు. తాజాగా టీజీపీఎస్సీ ప్రకటించిన గ్రూప్ 1 ఫలితాల్లో 70వ ర్యాంక్ సాధించి భలా అనిపించుకున్నాడు. గోపీకృష్ణ ఇప్పటి వరకు 7 కేంద్ర, 3 రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. ప్రస్తుతం గోపీ మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ గా శిక్షణ పొందుతున్నారు. త్వరలో గ్రూప్ 1 పోస్టులో జాయిన్ అవుతానని ఓ మీడియాతో మాట్లాడుతూ తెలిపాడు. ఒక్క ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే గగనమైపోతున్న తరుణంలో ఏకంగా 10 కొలువులు సాధించిన గోపీకృష్ణపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కుటుంబంలో ఆనందం వెల్లువిరిసింది.