ప్రముఖ దర్శకుడు టి. కృష్ణ కుమారుడిగా తొలివలపు సినిమాతో హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమకు గోపీచంద్ పరిచయం అయ్యాడు. తర్వాత విలన్ క్యారెక్టర్స్ లో నటించి అదరగొట్టాడు. జయం, నిజం, వర్షం సినిమాల్లో విలన్ గా చేసి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత యజ్ఞం సినిమాతో మళ్లీ హీరోగా సినీ కెరీర్ ను ప్రారంభించాడు. తర్వాత అనేక హిట్ సినిమాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు తాజాగా రామబాణం సినిమాతో ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హీరో గోపీచంద్ కు లక్ష్యం, లౌక్యం వంటి హిట్ చిత్రాలు అందించిన డైరెక్టర్ శ్రీవాస్..తాజాగా ఆయన దర్శకత్వంలో గోపీచంద్ మూడోసారి హీరోగా నటించిన మూవీ రామబాణం. నందమూరి నటిసింహం బాలకృష్ణ చెప్పిన టైటిల్ తో వచ్చిన ఈ మూవీ ట్రైలర్, టీజర్, సాంగ్స్, పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
Also Read : Sharad Pawar: ఎన్సీపీ అధినేతగా శరద్ పవార్ కొనసాగాలి.. రాజీనామా తిరస్కరణ
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన సినిమా రామబాణం. ఇంతుకు ముందు లక్ష్యం సినిమాలో అన్నదమ్ముల్లుగా నటించిన గోపీచంద్, జగపతి బాబు మరోసారి ఈ సినిమాలో బ్రదర్స్ క్యారెక్టర్స్ పోషించారు. ఈ మూవీలో డింపుల్ హయాతి హీరోయిన్ గా యాక్ట్ చేసింది. హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో రామబాణం సినిమా ప్రీవ్యూ షోలు పడ్డాయి. వీటి నుంచి మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. రొటీన్ కత అయినప్పటికీ కూడా కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ పర్ఫెక్ట్ గా కుదిరాయని టాక్ వచ్చింది. ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయ్యాయని ట్విట్టర్ వేదికగా రివ్యూలో వెల్లడించారు. ఈ సినిమా మాస్ ఆడియెన్స్ కు మాత్రం కచ్చితంగా నచ్చుతుందని అంటున్నారు.
Also Read : AC Helmet: తెలంగాణ సర్కార్ కూల్ వార్త.. త్వరలో ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్
రామబాణం సినిమాలో డైరెక్టర్ శ్రీవాస్ జగపతి బాబు, గోపీచంద్ మధ్య అన్నదమ్ముల బంధం చాలా బాగా చూపించారని ట్విట్టర్ రివ్యూలో తెలిపారు. ఇందులో జగపతి బాబు కెమికల్ ఫార్మింగ్ పై పోరాటం చేస్తూ ఆర్గానిక్ ఫుడ్ చేసే మేలు గురించి చెబుతుంటాడు. ఈ సినిమా అంతా కోల్ కతా బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. హీరోయిన్ డింపుల్ యూట్యూబర్ గా తన అందం, నటనతో అలరించిందని చెబుతున్నారు. రామబాణం చిత్రం మొత్తం యాక్షన్ సీక్వెన్స్ తో అదిరిపోయిందని మరికొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. తన అన్నయ్య జగపతి బాబు, వదిన కోసం గోపీచంద్ చేసే యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటాయట. అలాగే సినిమాలో హీరోయిన్ డింపుల్ తో రొమాన్స్, కామెడీ, డ్రామా అన్ని కలగలిపిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నిలిచిందని నెటిజన్స్ తమ అభిప్రాయాలు చెబుతున్నారు.