గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. గతంలో ఉద్యోగాలు పొందిన వారికి ప్రొబేషన్ ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో 2020 సంవత్సరంలో జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు పొందిన వీరు ప్రస్తుతం రూ.15 వేల గౌరవ వేతనంతో పనిచేస్తుండగా.. ప్రొబేషన్ ఖరారు తర్వాత దాదాపు రెట్టింపు జీతం అందుకోనున్నారు.. కాగా, గ్రామ, వార్డు సచివాలయాల్లో మొత్తం 19 రకాల విభాగాల్లో ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రభుత్వం తాజాగా జారీ చేసిన…