అండర్ 19 ఉమెన్స్ వరల్డ్ కప్ 2025లో యువ కెరటం తెలుగమ్మయి గొంగిడి త్రిష దేశ ఖ్యాతిని నలుదిశలా చాటిచెప్పింది. అద్భుతమైన పర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ లో సత్తా చాటి జట్టు విజయంలో కీ రోల్ ప్లే చేసింది.32 బంతుల్లో 44 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచింది. బౌలింగ్ లోనూ సత్తా చాటి మూడు వికెట్లను ఖాతాలో వేసుకుంది. ఈ సందర్భంగా మీడియాతో పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది గొంగిడి త్రిష. మేము…
అండర్ 19 ఉమెన్స్ వరల్డ్ కప్ 2025 భారత్ గెలుచుకున్నవిషయం తెలిసిందే. భారత్- దక్షిణాఫ్రికా మధ్య జరిగిన భీకర పోరులో భారత జట్టు విజయ దుందుభి మోగించింది. బ్యాటిగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో అద్భుతమైన ప్రతిభ కనబర్చి చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ లో తెలుగు తేజం గొంగిడి త్రిష అసాధారణ ప్రతిభ కనబర్చింది. 32 బంతుల్లో 44 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచింది. బౌలింగ్ లోనూ సత్తా చాటి మూడు వికెట్లను…
అండర్-19 మహిళల ప్రపంచకప్ 2025 రెండో సెమీస్‌లో భాగంగా మరికొద్దిసేపట్లో ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన ఇంగ్లండ్ కెప్టెన్ అబీ నారోగ్రోవ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది. ప్రపంచకప్‌లో జోరుమీదున్న భారత జట్టును ఆపడం ఇంగ్లండ్‌కు పెను సవాలే. టోర్నీలో అపజయమే లేని భారత్ సెమీస్‌లోనూ గెలవాలనే పట్టుదలతో ఉంది. అండర్-19 ప్రపంచకప్‌లో భారత్ జోరు కొనసాగుతోంది. గ్రూప్ దశలో వెస్టిండీస్,…
మహిళల అండర్-19 ప్రపంచకప్ 2025లో జోరుమీదున్న భారత జట్టు కీలక సమరానికి సిద్ధమైంది. కౌలాలంపూర్‌లోని బయుమాస్ ఓవల్ స్టేడియంలో శుక్రవారం జరిగే రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్‌ను ఢీకొంటుంది. భారత కాలమానం ప్రకారం.. మ్యాచ్ మధ్యాహ్నం 12 గంటలకు ఆరంభం కానుంది. మొదటి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మహిళలు తలపడనున్నారు. సెమీఫైనల్లో గెలిచిన జట్లు ఆదివారం జరిగే ఫైనల్లో ఢీ కొట్టనున్నాయి. అండర్-19 ప్రపంచకప్‌లో భారత్ జోరు కొనసాగుతోంది. గ్రూప్ దశలో వెస్టిండీస్, మలేసియాలను 10 వికెట్ల తేడాతో…
అండర్-19 టీ20 ప్రపంచకప్ 2025లో తెలంగాణ అమ్మాయి గొంగిడి త్రిష అదరగొడుతున్న విషయం తెలిసిందే. టోర్నీలో ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడిన త్రిష 230 పరుగులు చేసింది. బంగ్లాదేశ్‌పై (40), శ్రీలంకపై (49)పై కీలక ఇన్నింగ్స్‌లు ఆడిన తెలుగమ్మాయి.. స్కాట్లాండ్‌పై సెంచరీ (110) చేసింది. 59 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్సులతో శతకం బాదింది. దాంతో అండర్-19 మహిళల ప్రపంచకప్‌లో సెంచరీ చేసిన తొలి మహిళగా త్రిష రికార్డు సృష్టించింది. ఈ రికార్డుపై మాజీ మంత్రి,…
అంతర్జాతీయ మహిళల అండర్-19 క్రికెట్ కప్ చరిత్రలో మొట్టమొదటి సెంచరీని నమోదు చేసి, చరిత్ర సృష్టించిన తెలంగాణ బిడ్డ గొంగడి త్రిషను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అభినందించారు. ఆమె మరింత ఉన్నతస్థాయికి వెళ్లాలని.. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యుత్తమ ప్లేయర్‌గా ఎదగాలని ఆకాంక్షించారు. త్రిష సాధించిన సెంచరీ.. క్రీడల్లో రాణించాలనుకుంటున్న ఎంతోమంది ఆడబిడ్డలకు స్పూర్తిగా నిలుస్తుందన్నారు.
మలేసియా వేదికగా జరుగుతున్న అండర్-19 టీ20 ప్రపంచకప్ 2025లో భారత అమ్మాయిలు దూసుకుపోతున్నారు. గ్రూప్-ఎలో ఉన్న భారత్.. వెస్టిండీస్, మలేసియా జట్లపై విజయం సాధించింది. నేడు కౌలాలంపూర్ వేదికగా శ్రీలంకతో తలపడవుతోంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టాన్ని 118 పరుగులు చేసింది. తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష తృటిలో హాఫ్ సెంచరీ మిస్ చేసుకుంది. 44 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సుతో 49 రన్స్…
అండర్-19 ఆసియా కప్ 2024 విజేతగా భారత మహిళా జట్టు నిలిచింది. ఆదివారం కౌలాలంపూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 41 పరుగుల తేడాతో గెలిచింది. 118 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా 18.3 ఓవర్లలో 76 పరుగులకు ఆలౌట్ అయింది. జువైరియా ఫెర్డోస్ (22) టాప్ స్కోరర్. మహిళల విభాగంలో టీ20 ఫార్మాట్‌లో తొలిసారి జరిగిన అండర్-19 ఆసియా కప్‌ను టీమిండియా సొంతం చేసుకుంది. ఇటీవలే అండర్-19 పురుషల ఆసియా కప్ ఫైనల్లో…
దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన అండర్ 19 మహిళల టీ20 వరల్డ్‌కప్‌ను భారత్ కైవసం చేసుకుంది. ఆదివారం సాయంత్రం ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో టీమిండియా ఏకపక్ష విజయం సాధించి ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడింది.