తెలుగు సినీ అభిమానుల్లో చాలామంది మలయాళ సినిమాలు చూడడం మొదలుపెట్టారు. ఒటీటీల పుణ్యామాని మలయాళంలో మంచి కంటెంట్ ఉన్న సినిమాలు తెరకెక్కుతాయి అనే విషయం ప్రతి సినీ అభిమానికి అర్ధమయ్యింది. అయితే అసలు ఒటీటీల ప్రభావం అంతగా లేని సమయంలోనే తెలుగు యూత్ ని మలయాళ సినిమాలని చూసేలా చేసిన మూవీ ‘ప్రేమమ్’. నివిన్ పౌలీ, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ 2015లో రిలీజ్ అయ్యింది. అప్పటికి కాలేజ్ చదువుతున్న ప్రతి ఒక్కరూ ప్రేమమ్ సినిమాని మిస్ అవ్వకుండా చూసే ఉంటారు. బ్యూటిఫుల్ లవ్ స్టొరీ, సూపర్బ్ కాస్ట్ పెర్ఫార్మెన్స్, హీరో యాటిట్యూడ్, కూల్ బ్రీజ్ లాంటి సాంగ్స్ అన్నీ కలిపి ప్రేమమ్ సినిమాకి ఒక కల్ట్ స్టేటస్ తెచ్చిపెట్టాయి. ఈ మూవీని చూసిన తర్వాత, ఎంతోమంది అబ్బాయిలు నివిన్ లాగా బ్లాక్ షర్ట్ వేసి లుంగీ కడితే… అమ్మాయిల్లో చాలా మంది సాయి పల్లవిలా చీర కట్టుకోని కాలేజ్ ఫంక్షన్స్ కి వెళ్లారు. యూత్ కి ఇలాంటి ఒక లవ్ స్టొరీ సినిమా ఇచ్చిన దర్శకుడు ‘ఆల్ఫనోస్ పుత్రెన్'(Alphonse Puthren) దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత చేస్తున్న సినిమా ‘గోల్డ్'(Gold).
Read Also: Naga Shaurya: దేవుడా.. నాగ శౌర్య అంత కట్నం తీసుకున్నాడా..?
ఆల్ఫనోస్ పుత్రెన్ రాస్తూ డైరెక్ట్ చేస్తున్న ‘గోల్డ్’ మూవీలో మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ హీరోగా నటిస్తుండగా, హీరోయిన్ గా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీని తమిళ మలయాళ భాషల్లో సెప్టెంబర్ నెలలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు కానీ పోస్ట్ ప్రొడక్షన్ డిలే అవుతూ ఉండడంతో వాయిదా వేశారు. మొబైల్ షాప్ ఓనర్ అయిన ‘జోషి’కి ‘రాధా’ అనే అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయ్యాక అతనో కార్ కొంటాడు. ఇక్కడి నుంచి అతని లైఫ్ లో ఎలాంటి టర్న్స్ వచ్చాయి అనే విషయాన్ని గోల్డ్ సినిమాలో చూపించబోతున్నారు. దాదాపుగా డిసెంబర్ లో ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీ టీజర్ ని త్వరలో విడుదల చేయనున్నారు. ప్రేమమ్ తర్వాత ఆల్ఫనోస్ పుత్రెన్ 2016లో ‘అవియాల్’ అనే అంథాలజీలో ఒక షార్ట్ స్టొరీని డైరెక్ట్ చేశాడు కానీ ఫుల్ లెంగ్త్ సినిమా మాత్రం ఇప్పటివరకూ డైరెక్ట్ చేయలేదు. ఇన్నేళ్ల తర్వాత ఆల్ఫనోస్ పుత్రెన్ సినిమా వస్తుంది అంటే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉంటాయి మరి ప్రేమమ్ డైరెక్టర్ ఆడియన్స్ కి ఈసారి ఎలాంటి గిఫ్ట్ ఇస్తాడో చూడాలి.