Gold and Silver Price in Hyderabad on 6th November 2023: గత కొన్నిరోజులుగా వరుసగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు నిన్న స్వల్పంగా తగ్గాయి. నేడు స్థిరంగా ఉన్నాయి. బులియన్ మార్కెట్‌లో సోమవారం (నవంబర్ 6) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,500 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 61,640గా ఉంది. ఈ పసిడి ధరలు దేశీయ మార్కెట్లో నేటి ఉదయం నమోదైనవి. గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం.. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,650లుగా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,790గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,150లు ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,350గా నమోదైంది. ముంబై, బెంగళూరు, కేరళ, హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 56,500 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 61,640గా కొనసాగుతోంది.
Also Read: VarunLav: వరుణ్- లావణ్య రిసెప్షన్.. సెలబ్రిటీలు ఎవరెవరు వచ్చారంటే.. ?
మరోవైపు వెండి ధర కూడా నేడు స్థిరంగా కొనసాగుతోంది. దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర నేడు రూ. 75,000లుగా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ. 75,000లు ఉండగా.. చెన్నైలో రూ. 78,000గా నమోదైంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 74,000గా ఉండగా.. హైదరాబాద్‌లో రూ. 78,000లుగా ఉంది. వరంగల్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 78,000గా కొనసాగుతోంది.