బంగారం కొంటున్నావారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈరోజు కూడా ధరలు తగ్గుముఖం పట్టాయి.. ఈరోజు తులంపై రూ.10 తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో తులం 24 క్యారెట్ బంగారం ధర రూ. 66,250 కి చేరింది. ఇక 10గ్రాములు 22 క్యారెట్ బంగారం ధర రూ.60,730 కి చేరింది.. ఇక వెండి ధరలు మాత్రం షాక్ ఇస్తున్నాయి…ఈరోజు వెండి ధర రూ.100 మేర పెరిగి.. కిలో వెండి ధర రూ. 79,600 వద్ద కొనసాగుతోంది.. ఇక ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం..
ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.60,730, 24 క్యారెట్ల రేటు రూ.66,250 గా ఉంది.. బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.60,730, 24 క్యారెట్ల ధర రూ.66,250 గా నమోదు అవుతుంది.. చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.61,480, 24 క్యారెట్లు రూ.67,080 గా ఉంది.. ఢిల్లీలో ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.60,880 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.66,390 గా ఉంది.. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ధర రూ.60,730 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.66,250గా ఉంది..
ఇక వెండి విషయానికొస్తే.. ఢిల్లీలో వెండి కిలో ధర రూ.75,100, ముంబైలో రూ.75,600, బెంగళూరులో రూ.75,000, కేరళలో రూ.79,000,చెన్నైలో కిలో వెండి ధర రూ.79,000 లుగా ఉంది. హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ. 79,000 ఉంది.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..