Gold Price on Akshaya Tritiya 2024 Day: అందరూ ఊహించిందే జరిగిందే. ‘అక్షయ తృతీయ’ వేళ బంగారం ధరలు మహిళలకు భారీ షాక్ ఇచ్చాయి. గత రెండు రోజులుగా తులంపై రూ.100 చొప్పున తగ్గిన పసిడి.. నేడు ఏకంగా రూ.850 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో శుక్రవారం (మే 10) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,000గా ఉండగా.. 24 క్యారెట్ల (999 గోల్డ్) 10 గ్రాముల ధర రూ.73,090గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారంపై రూ.850, 24 క్యారెట్ల బంగారంపై రూ.930 పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,150గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,240గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.67,000 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.73,090గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.67,050గా.. 24 క్యారెట్ల ధర రూ.73,150గా ఉంది. బెంగళూరు, కోల్‌కతా, కేరళ, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.67,000 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.73,090గా నమోదైంది.
Also Read: Sam Curran: చాలా బాధగా ఉంది.. మమల్ని క్షమించండి: సామ్ కరన్
మరోవైపు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో ఈరోజు కిలో వెండిపై రూ.1300 పెరిగి.. రూ.86,500లుగా ఉంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.86,500 కాగా.. ముంబైలో రూ.86,500గా ఉంది. చెన్నైలో రూ.90,000గా కొనసాగుతుండగా.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.90,000లుగా ఉంది. అత్యల్పంగా బెంగళూరులో కిలో వెండి ధర రూ.84,750గా ఉంది.