ఈజీమనీకి అలవాటుపడుతోంది యువత. ఎంత నిఘా వున్నా తమ పని కానిచ్చేస్తున్నారు. తాజాగా నంద్యాలతో ఓ కేటుగాడు జ్యూయలరీ షాప్ సిబ్బందినే బురిడీ కొట్టించాడు. సీసీ కెమెరాల నిఘా , సెక్యూరిటీ గార్డుల బందోబస్తు , సిబ్బంది అప్రమత్తతతో వుండే చందన బ్రదర్స్ షోరూమ్ లో చేతివాటం ప్రదర్శించాడు ఓ కేటుగాడు. దొరలా వెళ్లి సిబ్బంది కళ్ళు గప్పి, రూ.2 లక్షల విలువైన గోల్డ్ ఛైన్ కాజేసి , తీరిగ్గా కాఫీ తాగి దర్జాగా వెళ్ళిపోయాడు. చోరీ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకుని షాక్ కు గురైన సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Read Also: Sambani Chandrasekhar: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.500లకే గ్యాస్
నంద్యాలలోని చందన బ్రదర్స్ షోరూంలో బిజినెస్ పలచగా వుంది. సిబ్బంది భోజనం చేసి, రిలాక్స్ గా వుండే మధ్యాహ్నం సమయంలో షోరూంలో కాలు పెట్టాడు కేటుగాడు. గోల్డ్ సేల్స్ కౌంటర్ వద్దకు వెళ్లి , చైన్ల మోడల్స్ చూడటం మొదలు పెట్టాడు. సేల్స్ మెన్ శివకుమార్ కొన్ని మోడల్స్ చూపించాడు. శివకుమార్ ఏమరుపాటుగా వున్న సమయంలో తాను తెచ్చుకున్న నకిలీ ఛైన్ ను పెట్టి, గోల్డ్ చైన్ ను కాజేసి ,.తనకు నచ్చిన మాడల్స్ లేవని చెప్పి జారుకున్నాడు కేటుగాడు. ఐతే గోల్డ్ చైన్ల సంఖ్య కరెక్ట్ గా వున్న నాణ్యతలో తేడా రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు శివకుమార్. రూ 2 లక్షల విలువైన 34.గ్రాముల గోల్డ్ ఛైన్ ను కాజేసాడు కేటుగాడు. సీసీ టీవీ పుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టారు టూ టౌన్ పోలీసులు. చుట్టూ సి.సి.కెమెరాలు , భద్రత వున్న చందన బ్రదర్స్ షో రూంలో చోరీ జరిగిన తీరుపై ఆశ్చర్యపోతున్నారు పోలీసులు. రికార్డుల్లో వున్న ఫోటోలను పరిశీలించగా , నిందితుడు స్థానికేతరుడని తేలింది. దీంతో అతని కోసం గాలిస్తున్నారు పోలీసులు.
Read Also: Life Imprisonment: పరీక్షల్లో కాపీ కొడితే ఎవరికైనా జీవిత ఖైదు తప్పదు..