Viral Video of phone theft at Kanpur goes viral: అది ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ అనే పట్టణం. అక్కడ ఒక బిజీగా ఉన్న స్వీట్ షాప్ లో స్వీట్లు కొనేందుకు ఒక వ్యక్తి వ్యక్తి వెళ్లాడు. అయితే బిల్లు కట్టే సమయంలో..మరో వ్యక్తి అతని వద్దకు వచ్చి పక్కనే నిలబడ్డాడు. బిల్లు కడుతున్న క్రమంలో చేతిలో డబ్బులు పట్టుకొని చూస్తున్న వ్యక్తి జేబులోని నుంచి పక్కనే నిల్చుని ఉన్న మరో వ్యక్తి జేబులోంచి చాకచక్యంగా ఫోన్…
దొంగలు రెచ్చిపోతున్నారు. అందినకాడికి దోచుకుపోతున్నారు. పక్కవారికి కూడా ఎలాంటి అనుమానం రాకుండా.. చాలా ఈజీగా చోరీలు చేస్తున్నారు. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా చాకచక్యంగా దొంగతనాలకు పాల్పడుతున్నారు. భద్రాచలంలో అదే జరిగింది. చాలా సులువుగా.. ఏ మాత్రం కష్టపడకుండా.. ఎవ్వరికి కొంచెం కూడా అనుమానం రాకుండా.. బంగారు ఆభరణాలు చోరీ చేశారు. అంతా అయిపోయాక చూసుకుంటే తన ఆభరణాలు మాయం అయ్యాయని గ్రహించాడో వ్యక్తి. బూర్గంపాడుకు చెందిన సత్యవ్రత.. భద్రాచలంలోని యూబీరోడ్డులో ఉన్న హెచ్డీఎఫ్సీ బ్యాంకులో కొన్ని…
అదో గ్రేట్ రాబరీ. తుపాకీతో బెదిరించి బ్యాంక్ దోచేశాడో దుండగుడు. పట్టపగలు… రెండంటే రెండే నిముషాల్లో… అంతా సినీ ఫక్కీలో జరిగింది. చోరీలో పోయిన సొత్తు కంటే రాబరీ యాక్షన్ ప్లాన్ పోలీసులను అవాక్కయ్యేలా చేసింది. ఇది ముఠా పనా…!?. మారణాయుధాలతో తిరుగుతూ బ్యాంకులను టార్గెట్ ట్ చేస్తున్నాయా..!?. ఎన్నో అనుమానాలు. దీంతో కేసులో మిష్టరీని చేధించేందుకు స్పెషల్ టీంలు రంగంలోకి దిగాయి. శనివారం మధ్యాహ్నం రెండు గంటల సమయం..!!. అనకాపల్లి జిల్లా కాశింకోట మండలం నర్సింగబిల్లిలోని…
ముక్కలేనిదే ముద్ద దిగని వారికి ఆకాశాన్నంటిన చికెన్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. కొనలేరు.. తినకుండా వుండలేరు. బంగారం దొంగతనం చూశాం, డబ్బులు దొంగతనం చూశాం, విలువైన వస్తువులు కోసం దొంగతనాలు చూశాం. కానీ చికెన్ రేట్లు పెరగడంతో కోళ్ల దొంగతనం చేసిన ముగ్గురు యువకుల కథ ఇది. బైక్ పై వచ్చి దర్జాగా దొంగతనం చేసుకొని ఉడాయించారు. గత నెల రోజులుగా చికెన్ ధరలు కొండెక్కడంతో కొంతమంది దుండగులు రాత్రి సమయంలో చికెన్ దుకాణాలను టార్గెట్ చేశారు.…
మానసిక ప్రశాంతత కోసం గుడికెళతారు భక్తులు. పూజారులు పూజలు చేసి భక్తులకు ప్రసాదం అందిస్తారు. కానీ పూజారులే భక్తులపై దాడి చేసిన ఘటన సికింద్రాబాద్ లో కలకలం రేపుతోంది. సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ పూజారులు భక్తుడిపై దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. దీనికి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ వైరల్ అవుతోంది. ఆలయాల్లో భక్తులకు భద్రత లేకపోతే ఎలా అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. భక్తుల పూజారులు దాడి చేసినా అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. దేవునికి…
రాజేంద్రనగర్ హైదర్ షా కోట్ కస్తూర్భా గాంధీ ఆశ్రమం నుండి 14 మంది మహిళలు పరారవడం సంచలనంగా మారింది. నిన్న అర్థరాత్రి 2 గంటల సమయంలో కిటికీ అద్దాలు పగలగొట్టి పరారయ్యారు మహిళలు. పేటా కేసులో మహిళలను ఆశ్రమానికి తరలించారు పోలీసులు. మహిళల పరారీ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నార్సింగి పోలీసులు. సైబరాబాద్ పరిధిలో వ్యభిచారం నిర్వహిస్తున్న పలు గృహాల్లో హ్యూమన్ ట్రాఫికింగ్ రెస్క్యూ టీమ్ దాడులు చేసింది. అందులో ఉన్న 14…
గజరాజులకు ఆకలి ఎక్కువ. అందులోనూ చెరకు గడలు కనిపిస్తే చాలు వాటి ఆనందానికి అవధులు వుండవు. అందుకే పంట పొలాలపై పడి అవి బీభత్సం సృష్టిస్తుంటాయి. అయితే కేరళలోని ఆ గజరాజుకి మాత్రం రేషన్ బియ్యం అంటే ఇష్టం. ఎక్కడ రేషన్ బియ్యం కనిపించినా ఏనుగు లాగేస్తోంది. దీంతో ఇడుక్కి జిల్లాలో మూడురోజులుగా రేషన్ బియ్యం ప్రజలకు అందించడం లేదు. రాత్రికిరాత్రే రేషన్ దుకాణంలోని బియ్యం బస్తాలు మాయం అయిపోతున్నాయి. దొంగలు చేశారని కొందరు భావించారు. అయితే…