Fake Gold: కస్టమ్స్ నుంచి కొనుగోలు చేసిన బంగారాన్ని తక్కువ ధరకు విక్రయిస్తున్నామని వ్యాపారులను నమ్మించి కోట్లాది రూపాయలను మోసం చేస్తున్న ముఠాను మేడిపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.
గుంటూరు జిల్లాలో సంచలనం కలిగించిన బ్యాంక్ కుంభకోణంలో దర్యాప్తు వేగంగా సాగుతోంది. తెనాలి జీడీసీసీ బ్యాంక్ కుంభకోణంలో బ్యాంక్ మేనేజర్ నేతి వరలక్ష్మిని ప్రధాన సూత్రధారిగా నిర్ధారించారు బ్యాంకు ఉన్నతాధికారులు. ఉద్దేశ్య పూర్వకంగానే నకిలీ బంగారంతో రుణాలు ఇచ్చినట్లు గుర్తించిన అధికారులు చర్యలను వేగవంతం చేశారు. రూ.44 లక్షల బ్యాంకు సొమ్మును నిందితులనుండి రికవరీ చేశారు అధికారులు. బ్యాంక్ మేనేజర్ ,అసిస్టెంట్ మేనేజర్ , క్యాషియర్ లపై సస్పెన్షన్ వేటు వేశారు ఉన్నతాధికారులు. మరో వైపు క్రిమినల్…
ఉమ్మడి గుంటూరు జిల్లాలో బ్యాంక్ ఉద్యోగులు చేతి వాటం ఖాతాదారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.. కంచె చేను మేసిన చందంగా బ్యాంక్ ఉద్యోగులు బ్యాంకుల్నే మోసం చేస్తున్నారు. నిన్న రాజుపాలెం మండలం నేడు తెనాలి జీడీసీసీ బ్యాంక్ లలో వరుస గోల్డ్ స్కాం లు బ్యాంక్ ల లో సిబ్బంది నిర్వాకాన్ని బయటపెట్టింది. పల్నాడు ప్రాంతం రాజుపాలెంలో సెంట్రల్ బ్యాంక్ లో గిల్ట్ బంగారం వ్యవహారం బయట పడింది. ఈ వ్యవహారం బయటకు వచ్చిన…
జనంలో అత్యాశ ఉన్నంత వరకూ మోసం చేసే వాళ్ళు ఉంటారని ఇద్దరు నకిలీ బంగారం దొంగలు మరోసారి నిరూపించారు. బంగారం మీద ఉన్న మోజు ఉన్న వరంగల్ వాసులను మోసం చేసి క్యాష్ చేసుకుందాం అనుకున్న అంతర్ రాష్ట్ర దొంగల ఆటకట్టించారు వరంగల్ పోలీసులు. వారిని కటకటాల వెనుకకు నెట్టారు. పోలీసుల వెనుక నిలబడ్డ ఈ ఇద్దరు కేడీలు కర్ణాటక రాష్ట్రం శ్రీరంగపట్టణంకి చెందిన మోహన్‌లాల్. సోలంకి ధర్మ. వీళ్ళేం మామూలు వ్యక్తులేం కాదు. జనానికి బంగారంపై…