Eblu Feo X: భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EVs) పట్ల ఉన్న ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది. పెట్రోల్ ధరల పెరుగుదల, పర్యావరణ పరిరక్షణపై పెరుగుతున్న అవగాహన, ప్రభుత్వ ప్రోత్సాహకాలు కారణంగా ప్రజలు ఎలక్ట్రిక్ బైకులు, స్కూటర్ల వైపు మరింత ఆకర్షితులవుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో హీరో, బజాజ్, ఓలా, ఏథర్ లాంటి ప్రధాన కంపెనీలు తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. అయితే, వీటికి పోటీగా చిన్న కంపెనీలు కూడా ముందుకు వస్తూ, తక్కువ ధరలో మంచి ఫీచర్లు కలిగిన ఎలక్ట్రిక్ టూవీలర్లను విడుదల చేస్తున్నాయి.
Read Also: Family Suicide: హబ్సిగూడ కుటుంబం మృతి సూసైడ్ నోట్లో కీలక అంశాలు..
ఈ నేపథ్యంలో, దేశీయంగా ప్రాచుర్యం పొందుతున్న గోదావరి (Godawari) ఎలక్ట్రిక్ మోటార్స్ కంపెనీ తమ కొత్త మోడల్ Eblu Feo X ని భారత వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఈ స్కూటర్ మొదటిసారి 2024లో భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ప్రవేశపెట్టింది. మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచే ఇది మంచి ఆదరణ పొందుతూ.. అధికంగా అమ్ముడుపోతున్న స్కూటర్‌గా నిలిచింది. ఇప్పుడు 2025లో ఈ స్కూటర్ అప్డేట్ అయిన కొత్త వెర్షన్‌తో విడుదలైంది. ఈ కొత్త Eblu Feo X ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూ. 99,999 ఎక్స్-షోరూమ్ ధరకు విడుదల చేశారు. పాంటోన్ బ్లూ, వైన్ రెడ్, జెట్ బ్లాక్, టెలిగ్రే, ట్రాఫిక్ వైట్ అనే ఐదు రంగుల్లో ఈ స్కూటర్ అందుబాటులో ఉంటుంది.
7.4-అంగుళాల మల్టీ-కలర్ TFT ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, బ్లూటూత్ కనెక్టివిటీ, కాల్ అలర్ట్, టైప్-C USB ఛార్జింగ్ పోర్ట్, పూర్తిగా LED లైటింగ్, టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్ సెటప్, కాంబి బ్రేకింగ్ సిస్టమ్ (CBS), డిస్క్ బ్రేక్‌లు లాంటి ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. 28 లీటర్ల స్టోరేజ్ కలిగి ఉండడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. దీనితో ఎక్కువ సామగ్రిని తీసుకెళ్లవచ్చు. 12-అంగుళాల ట్యూబ్‌లెస్ అల్లాయ్ వీల్స్ అందుబాటులో ఉంది. Eblu Feo X స్కూటర్‌లో ఎకో, నార్మల్, పవర్ అనే మూడు రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. అలాగే రివర్స్ మోడ్ కూడా అందుబాటులో ఉంది. ఇది నూతన రైడర్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
Read Also: IT Raids: శ్రీ చైతన్య కాలేజీలపై రెండో రోజు ఐటీ సోదాలు..
ఈ స్కూటర్ 2.36 kWh బ్యాటరీ ప్యాక్ ను కలిగి ఉంది. దీని టాప్ స్పీడ్ 60 kmph. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే ఈ స్కూటర్ 110 కి.మీ ప్రయాణం చేయగలదు. 60V హోమ్ ఛార్జర్ ద్వారా 5 గంటల 25 నిమిషాల్లో బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అవుతుంది. ఈ స్కూటర్‌పై 5 సంవత్సరాల లేదా 50,000 కి.మీ వరకు వారంటీ లభిస్తుంది. ఇప్పటికే ఈ స్కూటర్ కు ప్రీ-ఆర్డర్లు వచ్చాయని సమాచారం.