కొంతమంది అమ్మాయిలు, వారి ప్రవర్తన చూస్తుంటే ఏంట్రా బాబు ఇలా ఉన్నారు అనిపిస్తుంది. అచ్చం సినిమాలో చూపించే విలన్స్ లానే బెదిరస్తూ , రోడ్లపై ఎలా పడితే అలా తిరుగుతూ ఉంటారు. వారికి పోలీసులు అన్న కూడా అస్సలు భయం ఉండదు. ఇలాగే రెచ్చిపోయిన ఓ మహిళ పోలీసులను సైతం బెదిరించింది. బుల్లెట్ బైక్ నడుపుతూ వచ్చిన ఆ మహిళ పోలీసులను పచ్చి బూతులు తిడుతూ, బైక్ పై చేయి వేస్తే నరికేస్తా అంటూ బెదిరించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది.
Also Read: Parineeti Chopra: మూడుముళ్ల బంధంతో ఒక్కటైన పరిణీతి చోప్రా-రాఘవ్ చద్దా.. పెళ్లి ఫొటోస్ వైరల్!
వైరల్ వీడియోలో ఓ యువతి బులెట్ బైక్ నడుపుకుంటూ వస్తూ ఉంటుంది. నిబంధనలకు విరుద్దంగా రోడ్డుపై డ్రైవ్ చేస్తుంది. అతివేగంతో బైక్ నడుపుతుంది. ఇది గమనించిన ట్రాఫిక్ పోలీసులు ఆమెను ఆపుతారు. బైక్ కు సంబంధించిన పేపర్లు, లైసెన్స్ అడుగుతారు. దీంతో ఆ యువతి ట్రాఫిక్ పోలీసులపై రెచ్చిపోయింది. బైక్ దిగమని పోలీసులు అడగ్గా దిగనని చెప్పిన మహిళ వారిని నోటికి వచ్చినట్లు తిట్టింది. అంతేకాదు ఆమెను బైక్ నుంచి కిందకు దిగాలంటూ బైక్ పై చేయి వేయగా చేయి నరికేస్తానంటూ బెదిరింపులకు పాల్పడింది.ఈ రోడ్డు నా తండ్రిది. నేను ట్యాక్స్ కడుతున్నాను. నన్ను ఎవరూ ఆపలేరు’ అంటూ పోలీసులను బెదిరించింది. అంతేకాదు గన్ లాంటి లైటర్ ను వారికి చూపించి బెదిరించింది. ఓ కానిస్టేబుల్ ను నెట్టేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇది చూసిన నెటిజన్లు ఆ యువతిపై మండిపడుతూ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఆ యువతిని 26 ఏళ్ల నూపుర్ ముఖేష్ పటేల్‌గా గుర్తించారు. ఆమె ఆర్కిటెక్ట్ గా పనిచేస్తుంది. పోలసులు ఆమెపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Meet NUPUR PATEL,
joyriding on her motorcycle without a #helmet on the Bandra-Worli Sea Link where two-wheelers are not permitted.She started verbally #abusing the police and even allegedly pointed her cigarette lighter, which was shaped like a #pistol, at the police when asked… pic.twitter.com/wGzuSDaUW8
— ShoneeKapoor (@ShoneeKapoor) September 24, 2023