మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ తాను జమ్మూ కాశ్మీర్ తదుపరి లెఫ్టినెంట్ గవర్నర్ అవుతాననే పుకార్లను తోసిపుచ్చారు. అంతేకాకుండా ఆ పదవిపై తనకు ఆసక్తి లేదని తెలిపారు. తాను ఉపాధి కోసం వెతకడం లేదని, జమ్మూ కాశ్మీర్ ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నానని ఆయన అన్నారు.