Kieron Pollard: ‘పాత్రలు మాత్రమే మారాయి, లక్ష్యం ఒక్కటే’.. రోహిత్ శర్మ రీఎంట్రీపై పొలార్డ్ రియాక్షన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2027 సీజన్లో రోహిత్ శర్మ మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టబోతుండటంపై ఆ జట్టు కోచ్ కీరన్ పొలార్డ్ హర్షం వ్యక్తం చేశారు. 2020లో రోహిత్ సారథ్యంలో ముంబై ఐదోసారి టైటిల్ గెలిచిన తర్వాత, ఆ తర్వాత రోహిత్, హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో జట్టు ఛాంపియన్‌గా నిలవలేకపోయింది. గత సీజన్లో జట్టు నిరాశాజనక ప్రదర్శన నేపథ్యంలో ఫ్రాంచైజీ కోరడంతో, సుదీర్ఘ ఆలోచన అనంతరం రోహిత్ మళ్లీ పగ్గాలు చేపట్టేందుకు అంగీకరించారు.
ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ విడుదల చేసిన వీడియోలో కీరన్ పొలార్డ్ మాట్లాడుతూ.. తాము కలిసి ఎన్నో ఒడిదుడుకులు చూశామని, ఆ అనుభవాలు మున్ముందు జట్టుకు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. తన కెరీర్ మొత్తం ముంబైలో రోహిత్ ఒక లీడర్‌గా ఉన్నారని, 2013లో ఆయన కెప్టెన్ అయినప్పటి నుంచి ఇద్దరం కలిసి ఛాంపియన్‌షిప్‌లు గెలిచామని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు తమ పాత్రలు మారినప్పటికీ, లక్ష్యం మాత్రం ఒక్కటేనని.. ఆనందంగా విజయాలు సాధించడమే తమ అంతిమ లక్ష్యమని పొలార్డ్ స్పష్టం చేశారు. రోహిత్ లేని సమయాల్లో గతంలో పొలార్డ్ కూడా ముంబైకి సారథ్యం వహించారు. 2022లో క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన పొలార్డ్, రోహిత్ కెప్టెన్సీలో ఐదు టైటిళ్లు గెలిచిన జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నారు.
Also Read
- Delimitation: లోక్‌సభ సీట్ల పెంపుతో దక్షిణాదికి నష్టమన్న రాహుల్.. బిల్లుకు కట్టుబడి ఉన్నామన్న స్టాలిన్
- TSLPRB SI Exam: ప్రశాంతంగా ముగిసిన తెలంగాణ ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష.. ఎంత మంది హాజరయ్యారంటే..
- Koti Deepotsavam 2026 Day-16 Live : కోటి దీపోత్సవంలో కపాలీశ్వర స్వామి కల్యాణం.. 16వ రోజు విశేషాలివే.!
- Car Bonnet Smoke : కారు బోనెట్ నుంచి పొగ.. వెంటనే చేయాల్సిన పనులివే.!
మరోవైపు రోహిత్ శర్మ మాట్లాడుతూ.. రాబోయే సీజన్ ఎంతో ఉత్కంఠభరితంగా ఉండబోతోందని, అయితే తాను చాలా దూరం గురించి ఆలోచించడం లేదని చెప్పారు. ముందున్న సవాళ్లపైనే దృష్టి పెడుతూ ముందుకు సాగుతానని అన్నారు. తన మాజీ సహచరుడు పొలార్డ్ ప్రధాన కోచ్‌గా ఉండటం సంతోషంగా ఉందని, ముంబై సంస్కృతి, పరిస్థితులపై ఆయనకు పూర్తి అవగాహన ఉందని రోహిత్ ప్రశంసించారు. గతంలో తాను కెప్టెన్‌గా ఉన్నప్పుడు పొలార్డ్ వైస్ కెప్టెన్‌గా ఎన్నో సలహాలు ఇచ్చారని, ఇప్పుడు ఆయనను కోచ్‌గా కాకుండా ఒక మంచి స్నేహితుడిగానే చూస్తానని రోహిత్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-16 Live : కోటి దీపోత్సవంలో కపాలీశ్వర స్వామి కల్యాణం.. 16వ రోజు విశేషాలివే.!
-
Kieron Pollard: ‘పాత్రలు మాత్రమే మారాయి, లక్ష్యం ఒక్కటే’.. రోహిత్ శర్మ రీఎంట్రీపై పొలార్డ్ రియాక్షన్..
-
Healthy Cooking: ఫ్రిజ్‌లో పెట్టిన చపాతీ పిండి పాడవకుండా ఉండాలా? ఈ సింపుల్ హెల్తీ టిప్‌ను ఫాలో అవ్వండి!
-
Chinese Manja: మంగళ్‌హాట్‌లో చైనీస్ మాంజా ముఠా గుట్టురట్టు.. రూ. 2.40 లక్షల సొత్తు స్వాధీనం
-
Tata Sons Board Meeting: నోయెల్ టాటా వర్సెస్ చంద్రశేఖరన్.. రేపటి బోర్డు మీటింగ్‌లో ఏం జరగబోతోంది?
-
Delimitation: లోక్‌సభ సీట్ల పెంపుతో దక్షిణాదికి నష్టమన్న రాహుల్.. బిల్లుకు కట్టుబడి ఉన్నామన్న స్టాలిన్
ట్రెండింగ్
-
Car Bonnet Smoke : కారు బోనెట్ నుంచి పొగ.. వెంటనే చేయాల్సిన పనులివే.!
-
Eyeglass Lens Scratches : కళ్లద్దాలను చొక్కాతో తుడుస్తున్నారా?.. ఈ తప్పు అస్సలు చేయొద్దు.!
-
BSNL బంపర్ ఆఫర్..! ఆ రీఛార్జ్‌తో రూ. లక్ష బీమా ఫ్రీ..! రూ. 10 వేల సైబర్ బీమా కూడానూ..
-
MS Dhoni: ‘7’ నంబర్‌పై ధోనీ షాకింగ్ కామెంట్స్.. దాని వెనుక లాజిక్ ఇదే అంటూ..!
-
IND vs NZ: ముగిసిన మూడో రోజు ఆట.. భారీ ఆధిక్యం దిశగా న్యూజిలాండ్..!