Ganja Smuggling: తాజాగా ఏపీలో 300 కేజీల గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. ఇందుకు సంబంధించిన వివరాలు చూస్తే.. కంచికచర్ల పట్టణ శివారు ప్రాంతం 65వ జాతీయ రహదారి పై 300 కేజీల గంజాయిని పట్టుకున్నారు కంచికచర్ల పోలీసులు. ఈ సందర్బంగా కంచికచర్ల పోలీసు స్టేషన్ లో మీడియా సమావేశం నిర్వహించారు నందిగామ ఏసిపి రవి కిరణ్. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం అటవీ ప్రాంతం నుంచి 300 కేజీల గంజాయిని కొనుగోలు చేసి కారులో ముంబైకి అక్రమంగా తరలిస్తున్నట్లు ఏసిపి తెలిపారు. గంజాయిని తరలిస్తున్న వ్యక్తి మహారాష్ట్ర, పూణే జిల్లా సోంగాన్ గ్రామానికి చెందిన శుభం దత్తాత్రే భన్దవాల్కర్ (26) అరెస్టు చేశామని ఏసిపి రవికిరణ్ తెలిపారు.
Vijay: G.O.A.T సినిమాలో అతిధి పాత్రలో కనిపించనున్న స్టార్ క్రికెటర్..?
నర్సీపట్నంలో కేజీ గంజాయి 3000 రూపాయలకు కొనుగోలు చేసి ముంబైలో కేజీ సుమారు 10000 రూపాయలకు అమ్ముతున్నారు. గంజాయి 300 కేజీల విలువ 30 లక్షల రూపాయలు విలువ ఉంటుందని ఏసిపి తెలిపారు. నిందుతుడు దగ్గర నుంచి 300 గంజాయి, కారు, 3 సెల్ ఫోన్లు, 11500 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు నందిగామ ఏసిపి రవికిరణ్ తెలిపారు.
Duleep Trophy 2024: దేశవాళీ టోర్నీ ‘దులీప్ ట్రోఫీ’కి రంగం సిద్ధం.. మ్యాచుల షెడ్యూల్ ఇదే..