ఆత్మగౌరవ భవనాల పనుల పురోగతిపై కొకాపేట్‌లో క్షేత్ర స్థాయిలో మంత్రి గంగుల కమలాకర్ పర్యటించి పర్యవేక్షించారు. రెవెన్యూ, వాటర్ వర్క్స్, ఎలక్ట్రిసిటీ, హెచ్ఎండిఏ తదితర అన్ని విభాగాలు సమన్వయంతో వేగంగా పనులు పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. అంతేకాకుండా.. యాదవ, కురుమ ఆత్మగౌరవ భవనాలు ప్రారంభానికి సిద్దంగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. మిగతా భవనాల నిర్మాణాలకు అవసరమైన మౌలిక సదుపాయాల్ని వేగంగా అందజేస్తూ వాటిని సైతం త్వరలో పూర్తి చేస్తామన్నారు.
Also Read : Vodafone Layoffs : 11,000 మంది ఉద్యోగులను తొలగించిన వొడాఫోన్
మున్నూరు కాపు, ముదిరాజ్, గౌడ, బసవేశ్వర తదితర ఆత్మగౌరవ భవనాలు నిర్మాణంలో ఉన్నట్లు ఆయన తెలిపారు. తుది దశలో ప్రభుత్వం నిర్మించే ఆత్మగౌరవ భవనాల టెండర్ ప్రక్రియ కొనసాగుతోందని, ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పంతో 41 కుల సంఘాలకు కోకాపేట్, ఉప్పల్ బగాయత్‌లో వేల కోట్ల విలువైన 87.3 ఎకరాలు 95.25 కోట్లు ఖర్చుతో నిర్మిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. బీసీ ఆత్మగౌరవ భవనాల పురోగతిపై మంత్రి గంగుల కమలాకర్ క్షేత్రస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆయనతో పాటు.. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, బీసీ సంఘాల నేతలు, ముఖ్య శాఖల అధికారులు ఉన్నారు.
Also Read : Minister Kakani : వాళ్లు ప్రభుత్వంపై రైతులను ఉసిగొల్పుతున్నారు..