అంతర్జాతీయ కంపెనీలు ఒకదాని తర్వాత ఒకటిగా ఉద్యోగాలను తొలగిస్తున్నాయి. అమెజాన్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 18,000 మందిని తొలగించింది. తాజాగా మరో 9,000 మందిని ఇంటికి పంపనున్నట్లు ప్రకటించింది. అందులో భారతదేశం నుండి 500 మంది ఉన్నారు. దీనికి తోడు ఇప్పుడు బ్రిటిష్ టెలికాం దిగ్గజం వొడాఫోన్ కూడా 11,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీ షేర్ ధర రెండు దశాబ్దాల కనిష్ఠ స్థాయికి పడిపోయిన తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వోడాఫోన్ దాని పోటీతత్వాన్ని, కస్టమర్ సేవా అనుభవాన్ని మెరుగుపరచడానికి పునర్నిర్మాణంపై దృష్టి సారిస్తుందని ప్రకటించింది.
Also Read : DK Shivakumar: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా.. డీకే శివకుమార్ క్లారిటీ..
కంపెనీ ఖర్చులను భారీగా తగ్గించడమే ఉద్యోగుల తొలగింపులకు కారణం. వోడాఫోన్ కొత్త సీఈఓ మార్గరీటా డెల్లా వల్లే మాట్లాడుతూ.. తాము సులభమైన, చురుకైన కంపెనీ నిర్మాణాన్ని కలిగి ఉండాలని కోరుకుంటున్నామని చెప్పారు. ఆమె గత నెలలో వోడాఫోన్ కొత్త సీఈవోగా నియమితులయ్యారు.
Also Read : Somu Veerraju : కేంద్రం ఇచ్చే పథకాలను.. తమ సొంత పథకాలుగా చెప్పుకుంటున్నారు..
“నా ప్రాధాన్యత కస్టమర్లు, సౌలభ్యం, వృద్ధి. సంస్థను మరింత సరళీకృతం చేద్దాం. సంక్లిష్టతను తగ్గించి, పోటీతత్వాన్ని పెంచాలి. “కస్టమర్లకు నాణ్యమైన సేవలను అందించడానికి మేము వనరులను ఉపయోగిస్తాము” అని ప్రకటించారు. 11,000 ఉద్యోగాల కోత వోడాఫోన్ చరిత్రలో అతిపెద్దది. వోడాఫోన్ నిర్ణయం భారతదేశంలోని వోడాఫోన్ ఉద్యోగులపై ఎలాంటి ప్రభావం చూపదని పేర్కొన్నారు.