Himachal Pradesh: కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాల్లో ఒకటి హిమాచల్ ప్రదేశ్. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు నేడు తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. ఈరోజు ఇద్దరు ఎమ్మెల్యేలు సుఖూ ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాంగ్రా జిల్లా జైసింగ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే యద్వేంద్ర గోమా, బిలాస్‌పూర్ జిల్లా ఘుమర్విన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే రాజేష్ ధర్మాని నేడు మంత్రులుగా కేబినెట్లో జాయిన్ కానున్నారు. ఈరోజు మధ్యాహ్నం హిమాచల్ ప్రదేశ్ రాజ్ భవన్‌లో వీరిద్దరి ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. ఇందుకోసం ఇద్దరు ఎమ్మెల్యేలను సిమ్లాకు పిలిపించారు ముఖ్యమంత్రి. ఈ మంత్రివర్గ విస్తరణ తర్వాత హిమాచల్ ప్రదేశ్ మంత్రివర్గంలో ముఖ్యమంత్రితో సహా 11 మంది మంత్రులు ఉంటారు. అయితే, ఒక మంత్రి పదవి ఇంకా ఖాళీగానే ఉంటుంది. రాష్ట్రంలో గరిష్టంగా 12 మంది మంత్రులను చేయవచ్చు.
Read Also:Sandeep Reddy Vanga: ఓ వంగ మావా… దించు దించు ఈ కాంబినేషన్ ని దించు….
శాఖ కూడా మారుతుందా?
అయితే కేబినెట్ విస్తరణ మాత్రమే జరుగుతుందా.. లేక ఇప్పటికే నియమితులైన మంత్రుల రిపోర్ట్ కార్డుల ఆధారంగా శాఖల్లో మార్పులు జరుగుతాయా అన్నది తేలాల్సి ఉంది. ఏ మంత్రి అయినా, ఆయన శాఖ మారినా.. అది రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపడం ఖాయం. వచ్చే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ పార్టీ ఈ దిశగా దూకుడుగా అడుగులు వేసే అవకాశం ఉంది.
Read Also:Paidi Rakesh Reddy: మగధీర సినిమాలో రామ్ చరణ్‌లా అందరినీ చంపి చస్తా: ఆర్మూర్ ఎమ్మెల్యే
2022లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది
రాష్ట్రంలో చివరిసారిగా 2022లో ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత 68 సీట్లున్న అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ 40 సీట్లు గెలుచుకోగా, భారతీయ జనతా పార్టీ 25 సీట్లకు తగ్గింది. డిసెంబరు 11న ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు రాష్ట్రానికి నాయకత్వం వహించారు. ఆయనకు ముందు భారతీయ జనతా పార్టీకి చెందిన జైరాం ఠాకూర్ రాష్ట్ర ముఖ్యమంత్రి. సుఖ్ ప్రమాణ స్వీకారం తేదీని పరిశీలిస్తే.. సరిగ్గా ఏడాది తర్వాత మంత్రివర్గ విస్తరణ జరుగుతోంది.