Speaker Gaddam Prasad : కేసీఆర్‌ తెలంగాణను అల్లకల్లోలం చేసి పోయిండు

  • చేసిన పాపాలన్నీ మర్చిపోయిన హరీష్ రావు కేటీఆర్
  • కేటీఆర్ గజినీలాగా అయిపోయాడు
  • కేటీఆర్ పొద్దున లేస్తే అబద్దాలు తప్ప నిజాలు చెప్పే పరిస్థితి లేదు : స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌
Gaddam Prasad

Gaddam Prasad

Speaker Gaddam Prasad : కేసీఆర్‌ తెలంగాణను అల్లకల్లోలం చేసి పోయిండు.. ఏడు లక్షల కోట్లు అప్పుచేసి పోయిండని స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ అన్నారు. ఇవాళ వికారాబాద్‌లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. నెలకు రూ.7 వేల కోట్లు మిత్తి కడుతున్నామని, కేసీఆర్ ప్రభుత్వంలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేకుండే అని ఆయన వ్యాఖ్యానించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల నెల ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామని, చేసిన పాపాలన్నీ మర్చిపోయారు హరీష్ రావు, కేటీఆర్ అని ఆయన ఆరోపించారు. కేటీఆర్ గజినీలాగా అయిపోయాడని, కేటీఆర్ పొద్దున లేస్తే అబద్దాలు తప్ప నిజాలు చెప్పే పరిస్థితి లేదన్నారు. ఇంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి తనకోసం తన కుటుంబం కోసం చేసుకున్నాడని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోగ్యంగా ఉండాలన్నారు.

Top 10 Smallest Creatures: ప్రపంచంలోనే టాప్ 10 చిన్న జీవులు..

వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆనంద్ కు రాజకీయ అనుభవం లేదని, మేనిఫెస్టోలో పెట్టిన అన్ని కార్యక్రమాలు అమలు చేస్తామన్నారు స్పీకర్‌ ప్రసాద్ కుమార్. డిసెంబర్ 9 న సోనియా గాంధీ పుట్టిన రోజు అని, వికారాబాద్ జిల్లా సమగ్ర అభివృద్ధి జరుగుతుందని, పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తాయన్నారు. చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని ఆయన తెలిపారు. గ్రామాలలో బండల ఇండ్లు లేకుండా చూస్తామని, ఐదు సంవత్సరాల లోపల అన్ని వాగ్దానాలను పూర్తి చేస్తామన్నారు. గ్రామాలలో బెల్ట్ షాపులు లేకుండా చేస్తామని, నేను స్పీకర్ ను కాదు మీ అన్న లాంటి వాడిని ఆయన అన్నారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ పొద్దున నుండి రాత్రి 11 గంటల వరకు పనిచేస్తున్నాడన్నారు.

Viral Video: షోరూం ముందే కాలిపోయిన ఓలా స్కూటర్..