Vishal Garg: ఒక్క వీడియో కాల్‌తో 900 మంది ఉద్యోగాలు ఊడగొట్టాడు.. ఇప్పుడు తన CEO పదవే ఊడింది!
- ఒకప్పుడు ఒక్క కాల్లో 900 మందిని తొలగించాడు..
- ఇప్పుడు తన ఉద్యోగమే కోల్పోయాడు..
- Better.com సీఈఓ విశాల్ గార్గ్ పరిస్థితి వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vishal Garg: ఆన్లైన్ మోర్టిగేజ్ సంస్థ Better.comకు చెందిన 900 మంది ఉద్యోగుల్ని ఒక్క జూమ్ కాల్‌తో తొలగించారు. 2021లో భారత సంతతి సీఈఓ విశాల్ గార్గ్ ఇంత మంది ఉద్యోగుల్ని ఒకే దెబ్బతో తొలగించడం అప్పట్లో సంచలనంగా మారింది. అయితే, మరోసారి విశాల్ గార్గ్ వార్తల్లో నిలిచారు. అప్పట్లో 900 మందిని తొలగించిన ఈయనే ఇప్పుడు తన ఉద్యోగం కోల్పోయాడు. తాజాగా తన సీఈఓ పదవి నుంచి తొలగించిన తర్వాత, తిరిగి తీసుకోవాలని సంస్థ బోర్డును కోరతున్నాడు.
Better.com వ్యవస్థాపకుడు, మాజీ CEO అయిన గార్గ్‌ను ఆగస్టు 3న CEO పదవి నుంచి తొలగించారు. ఆయన స్థానంలో డేనియల్ లూయిస్‌ను కొత్త CEOగా నియమించారు.గార్గ్ ఆరోపణల ప్రకారం.. డేనియల్ లూయిస్ తొలుత సంస్థ వ్యూహంపై ఆసక్తి చూపిస్తూ తన విశ్వాసాన్ని పొందారు. ఖర్చులను తగ్గించడం, కంపెనీని లాభదాయకంగా మార్చడం వంటి అంశాలపై ఆరు నెలల క్రితం గార్గ్‌తో చర్చలు జరిపారు. అయితే చివరికి బోర్డులోకి ప్రవేశించి, ఇతర డైరెక్టర్ల విశ్వాసాన్ని సంపాదించుకుని తనను CEO పదవి నుంచి తప్పించారని గార్గ్ ఆరోపించారు. లూయిస్ ఖర్చు తగ్గింపుపై చేసిన ఆలోచనలు బాగున్నాయి, కానీ ఆయన ఆవిష్కరణలకు సంబంధించిన ఆలోచనలు అంతగా నచ్చలదేని గార్గ్ చెప్పినట్లు సీఎన్ఎన్ పేర్కొంది.
Also Read
- TRAI Internet TV Rules: TRAI కొత్త రూల్స్.. ఇంటర్నెట్లో ఫ్రీగా టీవీ ఛానెళ్లను చూడటం ఇక కష్టమేనా?
- Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
- iQOO 16: iQOO 16 లాంచ్ డేట్ ఫిక్స్.. 50MP కెమెరా, 8,400mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లే!
- Zeno Smart Phone: Zeno ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ లాంచ్.. బడ్జెట్ రూ.9,649.. 6,000mAh బ్యాటరీ, 90Hz రిఫ్రెష్ రేట్..
జూలై 27న లూయిస్‌ను కంపెనీ బోర్డులోకి తీసుకున్నారు. కేవలం వారం రోజుల్లోనే ఇతర డైరెక్టర్లను ఒప్పించి గార్గ్‌ను సీఈఓ పదవి నుంచి తొలగించి, తనను తాను కొత్త సీఈఓగా నియమించుకునే పరిస్థితి వచ్చిందని గార్గ్ ఆరోపించారు. బోర్డు పొరపాటు చేసిందని గార్గ్ వ్యాఖ్యానించారు. అయితే, గార్గ్ ఇప్పుడు ఈ పరిణామంపై న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. ప్రముఖ న్యాయవాది అలెక్స్ సాపిరోను నియమించుకున్నాడు. సాపిరో ద్వారా Better.com బోర్డుకు లేఖ పంపించి, తనను తిరిగి సీఈఓగా నియమించాలని డిమాండ్ చేశారు.
2021లో ఒకే కాల్లో 900 మంది ఔట్..
2021లో సంస్థలో పనిచేస్తున్న 900 మంది ఉద్యోగుల్ని ఒకే జూమ్ కాల్‌తో తొలగించిన సంఘటన అప్పట్లో సంచలనంగా సృష్టించింది. సంస్థ మార్కెట్ పరిస్థితులు, ఉద్యోగుల పనితీరు, ఉత్పాదకత వంటి కారణాలతో భారీ లేఆఫ్స్ ప్రకటించినట్లు అప్పట్లో విశాల్ గార్గ్ వెల్లడించారు. ఆ సమయంలో దాదాపు 250 మంది తొలగించబడిన ఉద్యోగులు తమ పని గంటలను అధికంగా చూపిస్తూ సంస్థను మోసం చేశారని గార్గ్ ఆరోపించారు. సరిగ్గా 5 ఏళ్ల తర్వాత అతనే సీఈఓ పదవిని కోల్పోయారు.
తాజావార్తలు
-
Shehbaz Sharif: ఆపరేషన్ సిందూర్‌పై షరీఫ్ ప్రేలాపనలు.. నవ్వుకున్న భారత్ దౌత్యవేత్త
-
Yogi-Modi Meeting: మోడీ-యోగి భేటీ.. యూపీ ఎన్నికల వేళ కీలక పరిణామం..
-
AP Crime: కళ్యాణి హత్య కేసులో షాకింగ్ విషయాలు.. మటన్‌తో కొట్టే కత్తులతో ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు..!
-
New Bus Stands: ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. తెలంగాణలో మరో 13 కొత్త బస్టాండ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
-
Satya Master: “నాలుగు ఎలుకల కోసం మ్యాన్షన్నే తగలబెడతారా?” జానీ మాస్టర్ భార్యపై సత్య మాస్టర్ సంచలన కామెంట్స్!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?