ప్రపంచంలోనే టాప్ పది అతి చిన్న జీవులు గురించి తెలుసుకుందాం...

 1. పెడోఫ్రైన్ అమౌయెన్సిస్: ఇది ప్రపంచంలోనే అతి చిన్న కప్ప. దీని పొడవు 7.7 మి.మీ మాత్రమే. 

2. పెడోసైప్రిస్ : ఇది  ప్రపంచంలోనే అతి చిన్న చేప. దీని పొడవు 7.9మి.మీ.

3.సన్నని గుడ్డి పాము: దీని పొడవు 10సెం.మీ ఉంటుంది. ఈ పాము భూగర్భంలో నివసిస్తుంది. 

4.కిట్టి హాగ్-నోస్డ్‌బ్యాట్ : దీనిని బంబుల్బీ బ్యాచ్ అని కూడా పిలుస్తారు. ఇది ప్రపంచంలోనే అతి చిన్న క్షీరదం. దీని పొడవు 29-33మి.మీ. 

5. బీ హమ్మింగ్ బర్డ్ : కేవలం 2 అంగుళాల పొడవు. ఇది ప్రపంచంలోనే అతి చిన్న పక్షి. 

 6. మచ్చల పెడ్లోపర్ తాబేలు: ఈ తాబేలు పొడవు దాదాపు 10 సెం.మీ.

7. ఎట్రుస్కాన్ ష్రూ: ఇది 3.5 సెం.మీ పొడవు. 1.8 గ్రాముల బరువు ఉన్న క్షీరదం. 

 8. బెర్తే మౌస్: ఇది అతి చిన్న కోతి. దీని పొడవు 9.2 సెం.మీ. బరువు 30 గ్రాములు. 

 9. పిగ్మీమార్మోసెట్: ఫింగర్ మంకీ అని కూడా పిలుస్తారు. 5-6 అంగుళాల పొడవు ఉంటుంది. 

 10. పిగ్మీ కుందేలు: ఇది ప్రపంచంలోనే అతి చిన్న కుందేలు. దీని పొడవు 11 అంగుళాల వరకు ఉంటుంది.