గచ్చిబౌలి డ్రగ్స్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. వివేకానందకు సయ్యద్ అబ్బాస్ అలీ 10 సార్లు డ్రగ్స్ సరఫరా చేసినట్టు పోలీసులు గుర్తించారు. నిన్న ( మంగళవారం ) సయ్యద్ అబ్బాస్ ఆలీని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. సయ్యద్ అబ్బాస్ అలీ, వివేకానంద, కేదార్ ముగ్గురి సెల్ ఫోన్స్ ను సైతం గచ్చిబౌలి పోలీసులు సీజ్ చేసినట్లు తెలిపారు. ఇక, ఈ ముగ్గురు సెల్ ఫోన్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. అయితే, సెల్ ఫోన్స్ లో డేటాను, మెసేజ్ లు, వాట్సప్ చాట్ ని రీట్రైవ్ చేస్తే మరింత సమాచారం పోలీసులకి అందనుంది. అయితే, కేదార్ పబ్బుల్లో డ్రగ్స్ పార్టీలు జరిగినట్టు గచ్చిబౌలి పోలీసులు అనుమానిస్తున్నారు.
Read Also: TDP-Janasena Public Meeting: నేడు టీడీపీ-జనసేన ఉమ్మడి బహిరంగ సభ.. హాజరుకానున్న చంద్రబాబు, పవన్
ఇక, డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నట్టు పోలీసుల విచారణలో తేలింది. క్రిష్ ను పిలిచి డ్రగ్స్ పరీక్షలు చేస్తామని పోలీసులు వెల్లడించారు. రాడిసన్ హోటల్లో సీసీ కెమెరాలలోని ఫుటేజ్ ని డిలీట్ చేసిన హోటల్ నిర్వాహకులు.. దీంతో హోటల్ నిర్వాహకులపై కూడా గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఈ కేసులో పెద్ద పెద్ద పొలిటికల్, సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో ఎవరు ఉన్న వారిని వదిలి పెట్టే ప్రసక్తి లేదని గచ్చిబౌలి పోలీసులు వెల్లడించారు.