కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'X'లో పోస్ట్ చేస్తూ.., 2024లో మోడీ ప్రభుత్వం నిష్క్రమణకు ప్రజలు మార్గం సుగమం చేయడం ప్రారంభించారని విమర్శించారు.
G20 Summit: జీ20 సదస్సు భారతదేశంలోని ఢిల్లీలో నిర్వహించబడుతోంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడమే కాకుండా చారిత్రాత్మకంగా మార్చేందుకు ప్రత్యేక సన్నాహాలు చేశారు.
G-20 Summit: ఢిల్లీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్న జీ-20 సదస్సులో తెలంగాణ రాష్ట్రంతోపాటు కరీంనగర్‌కు చెందిన కళాకారుల నైపుణ్యానికి అరుదైన గౌరవం దక్కింది. 20 దేశాల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటుండగా.. వారంతా తమ షర్టులపై జీ-20కి సంబంధించిన బ్యాడ్జీని ధరించారు.
సెప్టెంబర్ 9, 10వ తేదీల్లో జరుగనున్న G-20 సదస్సుకు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2023 భారతదేశానికి గొప్ప సంవత్సరం అని అన్నారు. భారతదేశం ప్రపంచ నాయకత్వాన్ని చూపడం చాలా అద్భుతంగా ఉందని తెలిపారు. G20 శిఖరాగ్ర సమావేశాన్ని ప్రస్తావిస్తూ.. భారతదేశం యొక్క స్థాయి, వైవిధ్యం మరియు అసాధారణ విజయాలు G20 అధ్యక్షతన సరైన సమయంలో సరైన దేశం నిర్వహిస్తోందని తెలిపారు.
హైదారబాద్ లోని తాజ్ కృష్ణ లో G-20 స్టార్టప్-20 సదస్సు ప్రారంభమైంది. ముఖ్యఅతిథిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సదస్సులో 20 దేశాల ప్రతినిధులు 9దేశాల ప్రత్యేక ఆహ్వానితులు వివిధ అంతర్జాతీయ స్టార్టప్ సంస్థలు పాల్గొన్నారు. స్టార్టప్ ల అభివృద్ధి ఎజెండాగా ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలపై ప్రతినిధులు చర్చించనున్నారు.
Vladimir Putin Sends 'New Year' Greetings To President Murmu, PM Modi: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్రమోదీలకు న్యూఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సర సందేశంతో పాటు ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగించాలని.. ఇంధనం, సైనిక సాంతకేతికత, ఇతర రంగాల్లో పెద్ద ఎత్తున వాణిజ్యం, ఆర్థిక ప్రాజెక్టులను నిర్వహించాలని కోరారు.
Google CEO Meets PM: భారత ప్రధాని నరేంద్ర మోదీతో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ భేటీ అయ్యారు. సోమవారం ఇరువురు సమావేశం అయ్యారు. అందరికి ఓపెన్, కనెక్టెడ్ ఇంటర్నెట్ కు మద్దతు ఇస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. ఇరువురి మధ్య జీ-20 సమావేశంపై చర్చ జరిగింది. ఈ నెల మొదట్లో భారత్ జీ-20 అధ్యక్ష బాధ్యతను తీసుకుంది. ‘‘గూగుల్ ఫర్ ఇండియా’’ ఈవెంట్ కు హాజరుకావడానికి సుందర్ పిచాయ్ ఇండియాకు వచ్చారు.
అమెరికాతో సహా పలు దేశాలు చైనాను హెచ్చరిస్తున్నప్పటికీ తైవాన్ విషయంలో వెనక్కి తగ్గడంలేదు. తైవాన్‌కు అంతర్జాతీయ గుర్తింపు లేదని, ఆ దేశం చైనాలో కలిసిపోవడం తప్ప మరో గత్యంతరం లేదని చైనా మరోసారి స్పష్టం చేసింది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌యూ జీ 20 దేశాల సదస్సులో ఈ విషయాన్ని తెలియజేశారు. వన్ చైనాను 50 ఏళ్ల క్రితమే అమెరికా అడ్డుకోలేకపోయిందని, ఈ విషయంలో ఎవరు అడ్డు తగలాలని చూసినా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చైనా…