Fuel Price Hike: పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు.. పాల నుంచి పప్పుల దాకా.. నెక్ట్స్ పెరిగేవి ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fuel Price Hike: దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత దేశంలో ఇంధన ధరలు పెరిగాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు ఆకాశాన్ని తాకడంతో ప్రభుత్వ రంగ చమురు సంస్థలు శుక్రవారం లీటరుకు సుమారు రూ. 3.39 వరకు పెంచాయి. అయితే, ఇదే చివరి పెంపు కాదని, ముడిచమురు సంక్షోభం ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో లేదా నెలల్లో ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు.. ఇంధన ధరల పెంపు ప్రభావం కేవలం వాహనదారులకే పరిమితం కాదు. డీజిల్ ధరలు పెరగడం వల్ల రవాణా ఖర్చులు భారీగా పెరుగుతాయి. మన దేశంలో కూరగాయలు, పండ్లు, పాలు, ధాన్యాలు వంటి నిత్యావసర వస్తువులన్నీ లారీలు, వ్యాన్ల ద్వారానే రవాణా అవుతాయి. రవాణా భారం పెరగడంతో సహజంగానే ఆ ప్రభావం వస్తువుల ధరలపై పడుతుంది. ఇప్పటికే అమూల్, మదర్ డెయిరీ సంస్థలు పాల ధరలను లీటరుకు రూ. 2 పెంచగా, దానికి ప్రధాన కారణం రవాణా ఖర్చులేనని పేర్కొన్నాయి. ఇది అంతిమంగా సామాన్యుడి వంటగది బడ్జెట్‌ను అస్తవ్యస్తం చేస్తుంది.
పెట్రోల్ ధరల పెంపుతో సొంత వాహనాలు వాడేవారికి నెలవారీ ఖర్చులు పెరుగుతాయి. మరోవైపు డీజిల్ ధరల వల్ల బస్సు ఛార్జీలు, క్యాబ్, ఆటో ధరలు కూడా పెరిగే ఛాన్స్ ఉంది. కేవలం ప్రయాణమే కాదు, మనకు అలవాటైన స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ యాప్స్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ సంస్థల డెలివరీ చార్జీలు సైతం పెరగవచ్చు. కంపెనీలు తమపై పడే అదనపు భారాన్ని తగ్గించుకోవడానికి డిస్కౌంట్లను తగ్గించడం లేదా డెలివరీ ఫీజులను పెంచడం వంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇంధన ధరల సెగ నగరాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా తగిలే ప్రమాదం ఉంది. రైతులు సాగు కోసం వాడే ట్రాక్టర్లు, నీటి పంపులు పూర్తిగా డీజిల్‌పైనే ఆధారపడి ఉంటాయి. డీజిల్ ధర పెరిగితే వ్యవసాయ పెట్టుబడి వ్యయం పెరిగి, రైతులకు లాభాలు తగ్గడమే కాకుండా ఆహార ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. పెరుగుతున్న ముడిచమురు ధరల దృష్ట్యా ఇంధన వినియోగాన్ని తగ్గించుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే పిలుపునిచ్చారు. చమురు సరఫరా ఖరీదైనదిగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో, ధరల పెరుగుదల అనివార్యమని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద, పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగడం అంటే కేవలం వాహనాలకే కాదు, నిత్యావసరాల నుంచి విలాసాల వరకు ప్రతి అంశంపై భారం పడుతుంది.
Also Read
- Silver: బంగారం తర్వాత ఇప్పుడు వెండి.. కేంద్రం కీలక నిర్ణయంతో పెరగనున్న ధరలు..
- Binance : బినాన్స్ యూజర్లకు అలర్ట్.. ఈ 7 సెక్యూరిటీ సెట్టింగ్స్ ఆన్ చేయకపోతే రిస్క్!
- New Bank: ఇండియాలోనే తొలిసారిగా.. ఆ బ్యాంక్ తెచ్చిన సరికొత్త విప్లవం.. సీఎం చేతుల మీదుగా ప్రారంభం..
- Petrol and Diesel Prices: మళ్లీ పెరగనున్న పెట్రో ధరలు..! ఇంధన ధరలపై నిపుణుల హెచ్చరిక
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్‌న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..