Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
- మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
- ప్రహసనంగా మారిందంటూ పెదవి విరుపులు
- శిక్షణ ఎవరికి ఇవ్వాలో నో క్లారిటీ
- తూతూ మంత్రంగా ముగిసిపోయిన మండల స్థాయి శిక్షణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ కమలం పార్టీలో ఓ కార్యక్రమం మొక్కుబడి తంతుగా నడిచిపోతోందా? ఎవరు, ఏం చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారో కూడా క్లారిటీ లేకుండా… ఏదో పెద్దోళ్ళు చెప్పారు కాబట్టి మేం గుడ్డెద్దు చేలో పడ్డట్టు నిర్వహిస్తున్నామని పార్టీ నేతలే అంటున్నారా? ఇంకా మాట్లాడితే… ఆ ప్రోగ్రామ్ని రాష్ట్ర నేతలు చాలామంది శిక్షగా భావిస్తున్నారా? అంతలా ఇబ్బంది పెడుతున్న ఆ కార్యక్రమం ఏది? ఎందుకు మమ అనిపిస్తున్నారు? దేశ వ్యాప్తంగా మెగా ట్రైనింగ్ కాంపెయిన్ నిర్వహిస్తోంది కమలం పార్టీ. దీన్ దయాళ్ ఉపాధ్యాయ…. ట్రైనింగ్ మెగా కాంపెయిన్ పేరుతో ఈ కార్యక్రమం జరుగుతోంది. అందులో భాగంగానే… తెలంగాణలో కూడా నడుస్తున్నాయి. కానీ… వీటివల్ల ఎవరికి, ఎంత లాభం అన్నది ప్రశ్నార్థకంగా ఉందట. అసలు ఈ ప్రక్రియ ఎంత సీరియస్ సాగుతోందన్న ప్రశ్నలు సైతం వస్తున్నాయి. వీటిపై రాష్ట్ర నాయకులు చాలా మంది పెదవి విరుస్తున్నారు. ఇదొక ప్రహసనంగా మారిందని, దీని వల్ల పెద్దగా వచ్చే ప్రయోజనం కూడా ఏమీ లేదనే అంటున్నట్టు తెలుస్తోంది. ముందసలు శిక్షణ ఎవరికి ఇవ్వాలనే దానిపైనే క్లారిటీ లేదట.
Also Read
చాలా చోట్ల ఇప్పటికీ… కింది స్థాయి కమిటీలే వేయలేదు, ఇక పిలిస్తే వచ్చేదెవరని అంటున్నట్టు సమాచారం. ఇప్పటికే మండల స్థాయి శిక్షణ తరగతులు జరిగాయి. వాటిని నిర్వహించిన తీరు పై విమర్శలు వస్తున్నాయి. వ్యవహారం మొత్తం తూతూ మంత్రంగా జరిగిపోయిందని అంటున్నారు. ఆ శిక్షణ తరగతులు ఎలా జరిగాయన్న దానిపై రిపోర్ట్ కావాలని రాష్ర్ట ఇన్చార్జి అభయ్ పాటిల్ ఆదేశించారు కూడా. కానీ… కొన్ని చోట్ల సంఖ్య కోసం పార్టీ కార్యక్రమాలతో సంబంధం లేని ఎవరెవరినో తీసుకొచ్చి కూర్చోబెట్టినట్టు చెప్పుకుంటున్నారు. అసలీ శిక్షణ తరగతులు ఓ శిక్షగా మారాయన్న గుసగుసలు సైతం పార్టీలో వినిపిస్తున్నాయి. ఇక త్వరలో జిల్లా స్థాయి ప్రశిక్షణ వర్గలు ప్రారంభం కాబోతున్నాయి. కానీ…చాలా జిల్లాల్లో ఇప్పటికీ అనుబంధ మోర్చా కమిటీలు కూడా పడలేదు. అసలు ఆ కమిటీల్లో ఎవరికి అవకాశం వస్తుందో కూడా తెలియదు. దీంతో… ఎలాంటి బాధ్యతలు లేకుండా… శిక్షణా తరగతులకు పిలిస్తే ఎవరొస్తారన్న మాటలు వినిపిస్తున్నాయి. ఓవరాల్‌గా కేంద్ర పార్టీ మానిటర్ చేస్తోంది కాబట్టి… ఏదో, అలా అలా…. చేశామంటే చేశామన్నట్టు లెక్క చెప్పుకోవడం కోసం రాష్ట్రంలో మొక్కుబడి కార్యక్రమం నడుస్తోందని పార్టీ నాయకులు చెప్పుకుంటున్నారు. సీరియస్‌గా కాకుండా…కేవలం టిక్కు పెట్టించుకోవడం కోసమే శిక్షణా తరగతులు నడుస్తున్నాయన్నది పార్టీ ఇంటర్నల్ ఒపీనియన్.
- Tags
- bjp
- NTV Telugu
- off the record
తాజావార్తలు
-
Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
-
Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?