Silver: బంగారం తర్వాత ఇప్పుడు వెండి.. కేంద్రం కీలక నిర్ణయంతో పెరగనున్న ధరలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలోకి వెండి దిగుమతులను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం నుంచి అమల్లోకి వచ్చేలా వెండి దిగుమతులపై కొత్త ఆంక్షలు విధిస్తూ విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ (DGFT) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం.. ఇకపై వ్యాపారులు విదేశాల నుండి వెండిని భారతదేశంలోకి తీసుకురావాలంటే ప్రభుత్వం నుంచి ప్రత్యేక లైసెన్స్ పొందడం తప్పనిసరి.
ఇంతకుముందు ఆర్బీఐ నిబంధనలకు లోబడి వెండి దిగుమతులకు స్వేచ్ఛ ఉండేది. కానీ తాజా మార్పులతో దీనిని ‘ఉచితం’ (Free) కేటగిరీ నుంచి ‘నియంత్రిత’ (Restricted) కేటగిరీలోకి మార్చారు. బరువులో 99.9 శాతం లేదా అంతకంటే ఎక్కువ స్వచ్ఛత కలిగిన వెండి కడ్డీలతో పాటు, బంగారం మరియు ప్లాటినం పూత పూసిన వెండి కడ్డీలకు కూడా ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయి. దీనివల్ల దేశంలోకి వచ్చే వెండి పరిమాణాన్ని ప్రభుత్వం పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకోనుంది.
Also Read
- Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
- Sugar: కొండెక్కిన చక్కెర ధర.. కేంద్రం కీలక నిర్ణయం
- Cupid Share: కండోమ్ కంపెనీకి కాసుల వర్షం.. రాబడి ఎంతో తెలుసా!
- Youtube Videos: రీల్స్, యూట్యూబ్ వీడియోలు చేస్తే లక్ష రూపాయలు... క్రియేటర్లకు పండగలాంటి వార్త చెప్పిన ప్రభుత్వం..
ఇటీవల మే 13న కేంద్ర ప్రభుత్వం బంగారంపై దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి ఏకంగా 15 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. ఆ నిర్ణయం జరిగిన కొద్ది రోజులకే ఈ కొత్త ఆంక్షలు విధించడం గమనార్హం. కేవలం పన్నులు పెంచడమే కాకుండా, వెండి దిగుమతులను పూర్తిగా కట్టడి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ వ్యూహాత్మక అడుగు వేసింది.
ప్రభుత్వం తీసుకున్న ఈ రెండు వరుస నిర్ణయాల వల్ల దేశీయ మార్కెట్లో వెండి లభ్యత తగ్గి, స్వల్పకాలంలో దాని ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఈ మార్పుల ప్రభావం వెండి వ్యాపారులు, ఆభరణాల తయారీదారులు మరియు పారిశ్రామిక కొనుగోలుదారులపై తక్షణమే పడనుంది.
తాజావార్తలు
-
Bihar: అందరికి డయాబెటిస్ ఉంది, చక్కెర ధర పెరిగిన పర్వాలేదు: బీహార్ మంత్రి..
-
Imran Khan: ఇమ్రాన్‌ఖాన్‌కు వైద్య పరీక్షలు పూర్తి.. తిరిగి జైలుకు తరలింపు
-
Suji Chilla Pizza Recipe: పిండికి బదులుగా బొంబాయి రవ్వతో కరకరలాడే పిజ్జా.. ఇంట్లోనే నిమిషాల్లో రెడీ!
-
BJP: రాహుల్ గాంధీ డ్రామాలు వీడియోల కోసమే.. బీజేపీ నేతల విమర్శలు..
-
Tarique Rahman: శాంతించిన తారిఖ్ రెహమాన్.. ఎల్లుండి భారత్‌లో పర్యటన!
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!